Credit Card Usage: క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యం చేస్తే ఏమవుతుంది?
క్రెడిట్ కార్డుల వినియోగం వల్ల ఎన్ని లాభాలున్నాయో.. ఆ బిల్లులను సమయానికి చెల్లించకపోతే వచ్చే కష్టాలూ అన్నే ఉంటాయి. ఆ వివరాలు మీ కోసం.
ఆలస్యం అమృతం విషం.. అంటుంటారు పెద్దలు. అది క్రెడిట్ కార్డుల (Credit Cards) చెల్లింపుల విషయంలో నూటికి నూరు పాళ్లు నిజం. కార్డు చెల్లింపులు ఆలస్యం చేస్తూ పోతే.. కార్డు కంపెనీకి మీరు కట్టాల్సిన మొత్తం పెరుగుతూ పోతుంది. (Credit Cards Usage)
- క్రెడిట్ కార్డు బిల్లులు ఆలస్యంగా చెల్లించడం మంచి అలవాటు కాదు. ఒక్కోసారి అది మీ ఆర్థిక ప్రణాళికలను దెబ్బ తీయొచ్చు. చెల్లింపులు ఆలస్యం చేస్తే అధిక వడ్డీ భారాన్ని మోయాల్సి ఉంటుంది.
- ఆటోమేటిక్ చెల్లింపుల ద్వారా సకాలంలో బకాయిలు తీర్చాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలుంటాయి. ఒకటి కార్డు సంస్థలు మీ క్రెడిట్ పరిమితిని పెంచొచ్చు. రెండోది మీ క్రెడిట్ స్కోరు మెరుగవుతుంది.
- సకాలంలో బిల్లులు కట్టకపోతే ఆలస్యపు రుసుములు విధిస్తారు. ఇవి ఖరీదైనవి. చెల్లింపుల ఆలస్యం కొనసాగుతున్న పక్షంలో ఇవి మరింతగా పెరుగుతాయి.
- బకాయిల ఆలస్యం వల్ల క్రెడిట్ స్కోరుకూ ఇబ్బంది రావొచ్చు. భవిష్యత్‌లో కొత్త రుణాలను తీసుకునే సమయంలో స్కోరును పెంచుకోవడం కష్టం కావొచ్చు.
- తరచూ చెల్లింపులు ఆలస్యం అవుతూ ఉంటే సదరు కంపెనీ ఏజెంట్లు ఫోన్ చేసి, బిల్లు కట్టించుకోవడానికి యత్నించవచ్చు. అది మీ వ్యక్తిగత జీవితంపై, మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి పెంచవచ్చు.
- తరచూ సమయానికి చెల్లింపులు జరగకపోతే వడ్డీ రేట్లను పెంచే అవకాశం లేకపోలేదు. సకాలంలో చెల్లింపుల వల్ల దీర్ఘకాలంలో మీరు డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఆలస్యపు రుసుములు, అధిక వడ్డీ రేట్ల వల్ల మీరు కష్టపడ్డ సొమ్ము కాస్తా వీటికే పెట్టాల్సి వస్తుంది.
- చెల్లింపులు ఆలస్యం అవుతూ ఉంటే ఆ కంపెనీ మీపై చట్టపరమైన చర్యలకు దిగే అవకాశం లేకపోలేదు. దీని వల్ల మీ విలువైన సమయం వృథా అవడమే కాకుండా.. డబ్బులూ ఖర్చవుతాయి. ఇది మీ ఆర్థిక భవితవ్యంపై ప్రతికూలంగా పనిచేయొచ్చు.
- కొత్త రుణాలు తీసుకోవడానికైనా, భవిష్యత్‌లో ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా ఉండాలన్నా.. సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు. -
కారు రుణాలపై ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎంతెంత?
దాదాపుగా అన్ని బ్యాంకులు వాహన రుణాలందిస్తున్నాయి. ఈ రుణాలకై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం. -
డీమ్యాట్ ఖాతా ఈ పొరపాట్లు చేయొద్దు
ఆర్థిక ప్రపంచంలోకి తొలి అడుగు పొదుపు ఖాతాతోనే ప్రారంభం అవుతుంది. ఇదే విధంగా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించాలనుకునే వారు డీమ్యాట్ ఖాతాతోనే తమ పెట్టుబడుల ప్రయాణాన్ని మొదలుపెడతారు. -
క్రెడిట్ కార్డులు రివార్డులు తగ్గుతున్నాయి
ఏడాది క్రితం వరకూ క్రెడిట్ కార్డులను ఎంత వాడితే.. అన్ని రివార్డు పాయింట్లు వచ్చేవి. వార్షిక రుసుములు రద్దయ్యేవి. చాలామంది వీటికోసమే డబ్బులున్నా సరే.. క్రెడిట్ కార్డులతోనే లావాదేవీలు చేసేవారు. -
స్థిరమైన రాబడి కోసం..
కెనరా రొబెకో మ్యూచువల్ ఫండ్ కొత్తగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ‘కెనరా రొబెకో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్’ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 26 వరకూ అందుబాటులో ఉంటుంది. -
ఇంటి పునరుద్ధరణ కోసం రుణం ఎలా పొందాలి?
ఇంటిని పునరుద్ధరించడం వల్ల దానికి మరింత ఆధునికతను జోడించవచ్చు. అయితే, దీనికి బాగానే ఖర్చవుతుంది, కాబట్టి రుణం తీసుకోవడం మేలు. ఈ రుణాన్ని పొందడానికి ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. -
ఎస్బీఐ, బీఓబీ నుంచి స్పెషల్ ఎఫ్డీ స్కీమ్స్.. వారికి 7.75% వడ్డీ
SBI, BOB new FDs: ప్రభుత్వరంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను తీసుకొచ్చాయి. -
వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎంతెంత?
ప్రస్తుతం అన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఎంతెంతో ఇక్కడ చూద్దాం... -
ఎస్బీఐ లోన్లు మరింత ప్రియం.. MCLR 10 పాయింట్లు పెంపు!
SBI Loans: రుణరేట్లను ఎస్బీఐ సవరించింది. ఎంసీఎల్ఆర్ ఆధారిత రేట్లను 0.10 శాతం మేర పెంచింది. -
ఉన్నత విద్యకు విద్యా రుణాలు ఎలా సహాయపడతాయి?
ఉన్నత విద్య సురక్షితమైన, సుసంపన్నమైన జీవితానికి ప్రవేశ ద్వారం లాంటిది. దీన్ని పొందడానికి బ్యాంకులిచ్చే విద్యారుణాలు ఎంతగానో ఉపయోగపడతాయి. -
ఫిక్స్డ్ డిపాజిట్లు.. అధిక వడ్డీ అందుతోందా?
గత కొన్నాళ్లుగా ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు కొనసాగుతున్నాయి. చాలా బ్యాంకులు 7.15-7.25 శాతం వరకూ వడ్డీని అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు దీనిపై అర శాతం అధికంగానే ఉంటుంది. -
ఆన్లైన్లో ఇన్స్టంట్ లోన్.. ఈ అంశాలు పరిశీలించాల్సిందే..!
ఆన్లైన్లో ఇన్స్టంట్ లోన్ తీసుకునే ముందు దరఖాస్తుదారులు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 13న ఈ సర్వీసులు పనిచేయవ్!
HDFC Bank downtime: జులై 13న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు కొన్ని సర్వీసులు అందుబాటులో ఉండవు. ఆ వివరాలు తెలుసుకోండి. -
స్టెప్- అప్ హోమ్‌లోన్ గురించి తెలుసా? ఎవరికి ప్రయోజనకరం?
Step- up home loan: హోమ్‌లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఇంతకీ స్టెప్- అప్ హోమ్‌లోన్ గురించి తెలుసా? -
విద్యుత్తు ఉపకరణాల సంస్థల్లో
విద్యుత్తు రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విద్యుత్తు సరఫరా, పంపిణీ విభాగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతోంది. -
ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన ఐసీఐసీఐ బ్యాంక్
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ రూ.3 కోట్ల వరకు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. -
క్రెడిట్ కార్డు రూల్స్‌లో మార్పులు.. ఈ జాబితాలో మీ బ్యాంక్ ఉందా?
Credit card rules: క్రెడిట్ కార్డులకు సంబంధించి బ్యాంకులు కొన్ని మార్పులు చేశాయి. జులై నుంచే ఆ మార్పులు అమల్లోకి రానున్నాయి. -
చికిత్స కోసం అప్పు చేస్తున్నారా?
ఆరోగ్య అత్యవసరం ఎప్పుడు ఏ రూపంలోనైనా రావచ్చు. దీనికి ఆర్థికంగా అన్ని వేళలా సిద్ధంగా ఉండాలి. ఆరోగ్య బీమా ఉన్నప్పుడు కొంత భరోసాగా ఉంటుంది. -
బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?
సురక్షితమైన రుణం కాబట్టి, బ్యాంకులు బంగారంపై సరసమైన వడ్డీ రేట్లకు వేగంగా రుణాలందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్‌లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్‌బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్‌పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి