Interest Rates: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించిన యెస్‌ బ్యాంక్‌

యెస్‌ బ్యాంకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది.

Published : 21 Nov 2023 17:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యెస్‌ బ్యాంకు రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను నిర్దిష్ట కాలవ్యవధికి 25 బేసిస్‌ పాయింట్ల (బీపీఎస్‌) వరకు పెంచింది. బ్యాంకు ఇకపై సాధారణ డిపాజిటర్లకు 3.25% కనిష్ఠ వడ్డీ రేటును అందిస్తుండగా.. 18 నెలల ఎఫ్‌డీలపై 7.75% వరకు గరిష్ఠ వడ్డీని అందించనుంది. అన్ని రకాల ఎఫ్‌డీలపై సీనియర్‌ సిటిజన్లు 0.50% అదనంగా పొందుతారు. సీనియర్‌ సిటిజన్లు కనీస కాలవ్యవధి ఎఫ్‌డీపై 3.75% వడ్డీ రేటును పొందుతారు. 18 నెలల కాలవ్యవధి ఎఫ్‌డీపై 8.25% వరకు గరిష్ఠ వడ్డీ పొందొచ్చు. కొత్త వడ్డీ రేట్లు 2023 నవంబర్‌ 21 నుంచి అమల్లో ఉంటాయి. యెస్‌ బ్యాంకు రూ.5 కోట్ల కంటే తక్కువ విలువ కలిగిన ఎఫ్‌డీలపై ముందస్తు ఉపసంహరణ జరిమానాను నవంబర్‌ ఆరంభంలో (1% వరకు) పెంచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని