సీఏఎఫ్‌ శిబిరంపై మావోయిస్టుల దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా హిరోలీ ప్రాంతంలో సీఏఎఫ్‌(ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌) శిబిరంపై బుధవారం రాత్రి మావోయిస్టులు జరిపిన మెరుపుదాడుల్లో ఇద్దరు జవాన్లతో పాటు

Published : 24 Jun 2022 04:24 IST

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా హిరోలీ ప్రాంతంలో సీఏఎఫ్‌(ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌) శిబిరంపై బుధవారం రాత్రి మావోయిస్టులు జరిపిన మెరుపుదాడుల్లో ఇద్దరు జవాన్లతో పాటు మరో ఇద్దరు నిర్మాణ కార్మికులు గాయపడ్డారు. కొద్దిరోజుల కిందట మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బైలాడీలా కొండల కింద ఉన్న హిరోలీలో పోలీసు ఉన్నతాధికారులు కొత్తగా సీఏఎఫ్‌ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై ఆగ్రహించిన మావోయిస్టులు రాత్రి బలగాలపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో సలీం లక్డా, కిషన్‌ అనే ఇద్దరు జవాన్లకు.. మరో ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. దర్బా డివిజన్‌లోని మలంగీర్‌ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు దంతెవాడ పోలీసులు గురువారం వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని