రూ.1.72కోట్ల తపాలాశాఖ సొమ్ము స్వాహా

రద్దు చేసుకున్న రైల్వే టికెట్ల డబ్బును ప్రయాణికులు తిరిగి తీసుకున్నట్లు చూపి తపాలాశాఖ సొమ్మును స్వాహా చేసిన ఉద్యోగి(సస్పెండెడ్‌)పై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ వర్గాల

Published : 12 Aug 2022 05:21 IST

సస్పెండైన సబ్‌పోస్ట్‌మాస్టర్‌పై సీబీఐ కేసు

ఈనాడు, హైదరాబాద్‌: రద్దు చేసుకున్న రైల్వే టికెట్ల డబ్బును ప్రయాణికులు తిరిగి తీసుకున్నట్లు చూపి తపాలాశాఖ సొమ్మును స్వాహా చేసిన ఉద్యోగి(సస్పెండెడ్‌)పై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ వర్గాల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల సబ్‌పోస్టాఫీస్‌లో గతేడాది ఏప్రిల్‌ 19 నుంచి ఈ ఏడాది మే 17వరకు ఈ స్వాహాపర్వం కొనసాగింది. ఆ సమయంలో కొడకండ్లలో పనిచేసిన సబ్‌పోస్ట్‌మాస్టర్‌ కేసరి సతీష్‌ ఈ మోసానికి పాల్పడ్డాడు. రద్దయిన రైల్వేటికెట్లకు సంబంధించిన సొమ్మును సంబంధిత ప్రయాణికులు తీసుకున్నట్లు చూపే పద్దు కింద రికార్డుల్లో నమోదు చేసి ఏకంగా రూ.1.72 కోట్లను కొట్టేశాడు. ఆదివారాలు, సెలవుదినాల్లో మాత్రమే ఇలా డబ్బు ఉపసంహరించేలా జాగ్రత్త పడ్డాడు. తపాలాశాఖ వరంగల్‌ డివిజన్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయ అధికారుల పరిశీలనలో ఆదివారం నాడు ఉపసంహరణలు జరిగినట్లు గుర్తించడంతో అనుమానమొచ్చి కూపీ లాగారు. కొడకండ్ల కార్యాలయానికి వెళ్లి రికార్డుల్ని పరిశీలించడంతో బాగోతం బహిర్గతమైంది. ఈక్రమంలో సతీష్‌ను సస్పెండ్‌ చేశారు. తపాలాశాఖ వరంగల్‌ డివిజన్‌ సూపరింటెండెంట్‌ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని