రోడ్డు ప్రమాదంలో గాయపడి.. కాపాడాలంటూ 40 నిమిషాలు ఆర్తనాదాలు

మినీ లారీ ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో క్లీనర్‌ మృతిచెందిన సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు కోల్డ్‌స్టోరేజి సమీపంలో శుక్రవారం జరిగింది. స్థానికులు,

Published : 13 Aug 2022 02:36 IST

108 వాహనం రాకపోవడంతో మృతి?

వరికుంటపాడు, న్యూస్‌టుడే: మినీ లారీ ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో క్లీనర్‌ మృతిచెందిన సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు కోల్డ్‌స్టోరేజి సమీపంలో శుక్రవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... టమాటాల లోడుతో మదనపల్లె నుంచి నర్సీపట్నం వెళుతున్న లారీ కోల్డ్‌స్టోరేజీ సమీపంలో ఆగింది. కడప జిల్లా పోరుమామిళ్ల నుంచి ప్రకాశం జిల్లా కనిగిరికి పాలు, పెరుగు లోడుతో వెళుతున్న మినీ లారీ తెల్లవారుజామున 4:40 గంటల సమయంలో వేగంగా ఢీకొంది. మినిలారీలో ఉన్న కడప జిల్లా గోపవరం మండలం వడ్డే ఆగ్రహారం గ్రామానికి చెందిన క్లీనర్‌ వేముల వెంకటేష్‌(22) తీవ్ర గాయాలతో క్యాబిన్‌లోనే చిక్కుకొని మృతిచెందగా, మైదుకూరుకు చెందిన డ్రైవర్‌ చెంగారి సురేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనం కోసం సమాచారమిచ్చినా అందుబాటులో లేకపోవడంతో.. క్లీనర్‌ దాదాపు 40 నిమిషాల దాకా కాపాడాలని వేడుకుంటూ క్యాబిన్‌లోనే ప్రాణాలు కోల్పోయాడని డ్రైవర్‌ సురేష్‌ తెలిపారు. 108 వాహనం వచ్చి ఉంటే బతికేవాడని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరికుంటపాడు మండలంలో నాలుగు నెలలుగా 108 వాహనం మరమ్మతులతో వినియోగంలో లేదు. జాతీయ రహదారిపై ప్రమాదాల్లో క్షతగాత్రులను తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని