Hyderabad: రాయదుర్గంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కిడ్నాప్‌ కథ సుఖాంతం

రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కిడ్నాప్‌ కథ సుఖాంతమైందని పోలీసులు వెల్లడించారు.

Updated : 05 Jan 2024 17:36 IST

హైదరాబాద్‌: రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలకలం రేపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. కూకట్‌పల్లికి చెందిన సురేందర్‌బాబును నిన్న సాయంత్రం కొందరు వ్యక్తులు అపహరించారు.  బాధితుడి భార్యకు ఇంటర్నెట్‌ ద్వారా కాల్స్‌ చేసిన దుండగులు రూ.50లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సురేందర్‌బాబు పోలీసులకు అందుబాటులోకి వచ్చాడు. కాసేపట్లో నిందితులను రాయదుర్గం పీఎస్‌కు తరలించే అవకాశముంది. కిడ్నాప్‌నకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు తేల్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని