logo

ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు

వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఏకే త్రిపాఠి తెలిపారు.

Updated : 19 May 2024 03:52 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఏకే త్రిపాఠి తెలిపారు.

  • సంబల్‌పూర్‌-ఎస్‌ఎంవీ బెంగళూరు ప్రత్యేక రైలు ఈనెల 30 నుంచి జూన్‌ 27 వరకు నడపనున్నట్లు తెలిపారు. సంబల్‌పూర్‌లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.55 గంటలకు దువ్వాడ చేరుతుందని, 5 గంటలకు తిరిగి బయల్దేరి రాత్రి 11.30 గంటలకు బెంగళూరు చేరుతుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో రైలు జూన్‌ 1 నుంచి 29 వరకు నడుస్తుందని, బెంగళూరులో శనివారం రాత్రి 1.15 గంటలకు బయల్దేరి దువ్వాడకు రాత్రి 8.30 గంటలకు చేరి, మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు సంబల్‌పూర్‌ చేరుతుందని తెలిపారు. బర్‌గార్‌రోడ్డు, బలంగీర్, టిట్లాగర్, కెసింగ, మునిగుడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, గూడూరు, రేణిగుంట, కాటపడి, జోలార్‌పెట్టాయ్, కృష్ణరాజపురం స్టేషన్లలో రైలు ఆగుతుందని తెలిపారు.
  • సంబల్‌పూర్‌-కాచిగూడ రైలు 27 నుంచి జూన్‌ 24 వరకు నడుస్తుందని, సంబల్‌పూర్‌లో రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3.30 గంటలకు రాయగడ చేరుతుందని, విజయనగరం ఉదయం 5.30, దువ్వాడ ఉదయం 7.20 గంటలకు చేరి, రాత్రి 9.50 గంటలకు కాచిగూడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 28 నుంచి జూన్‌ 25 వరకు నడిచే రైలు కాచిగూడలో రాత్రి 11.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు దువ్వాడ చేరుతుంది. విజయనగరం మధ్యాహ్నం 1.50, రాయగడ సాయంత్రం 4.05 గంటలకు చేరుతుంది. సంబల్‌పూర్‌ రాత్రి 11.45 గంటలకు చేరుతుంది.
  • విశాఖ-అమృత్‌సర్‌ రైలు మళ్లింపు: రైతుల ఆందోళనతో విశాఖపట్నం-అమృత్‌సర్‌ హిరాకుండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మార్గాన్ని మళ్లించినట్లు తెలిపారు. జఖాల్, ధురి, లూధియాన మీదుగా రైలు మళ్లించనున్నారు. పానిపట, అంబాల కాంట స్టేషన్లకు రైలు వెళ్లదని తెలియజేశారు. 21న విశాఖ నుంచి వెళ్లే రైలు, 22న అమృత్‌సర్‌ నుంచి వచ్చే రైలు మళ్లింపు ఉంటుందని పేర్కొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని