logo

అన్ని సౌకర్యాలతో పెరిశేపల్లిలో ‘కృష్ణమ్‌’ ఓల్డేజ్‌హోమ్‌

ఎలాంటి లాభాపేక్ష లేకుండా పుట్టిన గడ్డపై ఉన్న మమకారంతో హైదరాబాద్‌కు చెందిన విష్ణుకెమికల్స్‌ సంస్థ అధినేత చెరుకూరి కృష్ణమూర్తి, మంజుల దంపతులు తమ స్వగ్రామమైన పెరిశేపల్లిలో ‘కృష్ణమ్‌ ఓల్డేజ్‌ హోమ్‌’ ఏర్పాటుచేశారని ఆ సంస్థ సీనియర్‌

Published : 15 Aug 2022 05:44 IST

సమావేశంలో కంపెనీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు  

పామర్రు రూరల్‌, న్యూస్‌టుడే: ఎలాంటి లాభాపేక్ష లేకుండా పుట్టిన గడ్డపై ఉన్న మమకారంతో హైదరాబాద్‌కు చెందిన విష్ణుకెమికల్స్‌ సంస్థ అధినేత చెరుకూరి కృష్ణమూర్తి, మంజుల దంపతులు తమ స్వగ్రామమైన పెరిశేపల్లిలో ‘కృష్ణమ్‌ ఓల్డేజ్‌ హోమ్‌’ ఏర్పాటుచేశారని ఆ సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కండెపు రాజశేఖర్‌ పేర్కొన్నారు. ఆదివారం పెరిశేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో అన్ని ఉన్నా అందుబాటులో ఆదుకునే వారు లేక అనేకమంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారి కోసం తమ సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులు సుమారు రూ.20 కోట్లకు పైగా వెచ్చించి, పచ్చటి పొలాల మధ్య 8 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించిందన్నారు. అన్ని సౌకర్యాలతో రెండు అంతస్తులుగా నిర్మించిన ఈ భవంతిలో 46 మంది వసతి పొందేలా ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. పుష్టికరమైన ఆహారంతో పాటు మంచి వైద్యసేవలు అందించేందుకు విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ ప్రాంతాల్లోని పేరొందిన ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. గ్రామ ప్రముఖుడు, మాజీ ఎంపీపీ గొట్టిపాటి లక్ష్మీదాస్‌ మాట్లాడుతూ పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే పారిశ్రామికవేత్త కృష్ణమూర్తి 2016లో గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని వసతులు కల్పించారన్నారు.  ఈ కార్యక్రమంలో ఓల్డేజ్‌హోమ్‌ మేనేజర్‌ రాంబాబు, ఇంజినీరు రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు