logo

Nara Lokesh: పిల్ల సైకోకు నిజమైన షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తా: నారా లోకేశ్‌

తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. గన్నవరం. పుచ్చలపల్లి సుందరయ్య, దాసరి బాలవర్ధన్‌రావు వంటి ఎంతోమంది గొప్పవాళ్లు గన్నవరం ఎమ్మెల్యేలుగా చేశారు. ఇంత చరిత్ర ఉన్న గన్నవరంలో మేం చేసిన తప్పు వల్ల ఇక్కడొక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యాడు.

Updated : 23 Aug 2023 08:50 IST

గన్నవరం: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా 191వ రోజు మంగళవారం గన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అశేషంగా తెదేపా శ్రేణులు, అభిమానులు తరలిరాగా.. ఉమ్మడి కృష్ణా జిల్లా వైకాపా నేతలపై లోకేశ్‌ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో యువగళం యాత్ర చేసిన తర్వాత వైకాపా నేతలు మొరుగుతున్నారు. కానీ.. కృష్ణాలోకి రాక ముందే ఇక్కడ వైకాపా నేతలు ప్యాంట్లు తడుపుకొన్నారు. లోకేశ్‌ క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడికి అడుగు పెట్టాలని నాకు హెచ్చరికలు జారీ చేశారు. అమ్మవంటి అమరావతిని సైకో జగన్‌ చంపేస్తుంటే.. చప్పట్లు కొట్టిన మీరు కృష్ణా జిల్లా ప్రజలకు ముందు క్షమాపణ చెప్పాలని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

‘‘తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. గన్నవరం. పుచ్చలపల్లి సుందరయ్య, దాసరి బాలవర్ధన్‌రావు వంటి ఎంతోమంది గొప్పవాళ్లు గన్నవరం ఎమ్మెల్యేలుగా చేశారు. ఇంత చరిత్ర ఉన్న గన్నవరంలో మేం చేసిన తప్పు వల్ల ఇక్కడొక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యాడు. గన్నవరం ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. మళ్లీ అలాంటి తప్పు చేయం. ఈ పిల్ల సైకో ఓ మహానటుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ఛాంబర్‌లోకి వచ్చి.. సార్‌, సార్‌ అని నిల్చునేవాడు. కూర్చోమన్నా.. నిల్చునే ఉంటాననేవాడు. 2012లో కృష్ణా జిల్లాకు సగం దరిద్రం పోయింది. ఆ సన్నబియ్యం సన్నాసి పోయాడు. ఇప్పుడు ఈ పిల్ల సైకో పోవడంతో మిగిలిన సగం దరిద్రం పోయింది. తన గెలుపు కోసం పనిచేసిన తెదేపా నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి మరీ వంశీ జైలుకు పంపించాడు. గన్నవరం పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తా. నిజమైన షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చే బాధ్యత నాది’’ అని లోకేశ్‌ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని