logo

నీరుగారిన చెత్త నిర్వహణ

మండల పరిధిలోని చెత్త నిర్వహణ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. రూ.లక్షలు వ్యయంతో నిర్మించిన కేంద్రాలను వినియోగించడం లేదు. ఫలితంగా గ్రామాల్లో రహదారుల వెంట చెత్త ఇష్టానుసారం పడేస్తున్నారు. 24 గ్రామాల్లో ఏడేళ్లనాడు చెత్త కేంద్రాలు నిర్మించారు.

Published : 19 May 2024 03:29 IST

గంపలగూడెం, న్యూస్‌టుడే

పెదకొమిరలో నిరుపయోగంగా చెత్త నిర్వహణ కేంద్రం

ఊటుకూరులో రహదారి పక్కన వ్యర్థాలు

మండల పరిధిలోని చెత్త నిర్వహణ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. రూ.లక్షలు వ్యయంతో నిర్మించిన కేంద్రాలను వినియోగించడం లేదు. ఫలితంగా గ్రామాల్లో రహదారుల వెంట చెత్త ఇష్టానుసారం పడేస్తున్నారు. 24 గ్రామాల్లో ఏడేళ్లనాడు చెత్త కేంద్రాలు నిర్మించారు. చెత్త నుంచి సంపద సృష్టించాలనే ఆశయం నిర్వహణ లోపంతో నీరుగారింది. ఆరంభంలో ఒకట్రెండు గ్రామాల్లో వీధుల్లో చెత్తను సేకరించి కేంద్రాలకు తరలించారు. తడి, పొడి చెత్త నుంచి ఎరువు తయారీకి శ్రీకారం చుట్టారు. అదంతా ఆరంభ శూరత్వమైంది. ఇళ్లలో చెత్త సేకరణకు సరఫరా చేసిన ఎరుపు, ఆకు పచ్చ డబ్బాలు ఆచూకీలేవు. మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై చెత్త దర్శనమిస్తోంది. ప్రధాన రహదారిపై దుకాణాలు, గృహాల ముందు చెత్తను విసిరేస్తున్నారు. వాటిలో ఆహార అన్వేషణకు కోతులు గుంపులుగా చేరి పాదచారులపై దాడులు చేస్తున్నాయి. గంపలగూడెం, తోటమూలలో ట్రాక్టర్లతో వీధుల్లో చెత్తను బయటకు తరలిస్తారు. గంపలగూడెం, తోటమూల, ఊటుకూరు, సత్యాలపాడు, పెనుగొలను తదితర గ్రామాల్లో ఊరికి సమీపంలో రహదారుల వెంట చెత్తను కుప్పలుగా వేస్తున్నారు. ఊటుకూరులో బడికి సమీపంలో చెత్తను వేస్తారు. నాలుగైదు రోజులకోసారి ఆ చెత్తకు నిప్పు పెడతారు. దీంతో రాకపోకలు చేసేవారు పొగ బారిన పడుతున్నారు. ఆవుల మంద మేత కోసం చెత్త కుప్పల వద్దకు చేరుతున్నాయి. అందులో ఉండే గాజు పెంకులు, పాలిథిన్‌ సంచులతో ఆవులు ప్రమాదాల బారినపడుతున్నాయి.

గంపలగూడెం సమీపంలో చెత్తకు నిప్పు పెట్టడంతో కమ్ముకున్న పొగ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని