వాహన ధరల్ని తగ్గించిన మారుతీ సుజుకీ.. ఏ మోడళ్లపై అంటే?

Maruti Suzuki: ఆటో గేర్‌ షిఫ్ట్‌ మోడల్‌ కార్ల ధరల్ని తగ్గించినట్లు కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ శనివారం ప్రకటించింది.

Updated : 01 Jun 2024 19:17 IST

Maruti Suzuki | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ  (Maruti Suzuki Sales) ఓ కీలక ప్రకటన చేసింది. తన కార్ల ధరను తగ్గించినట్లు పేర్కొంది. ఆటో గేర్‌ షిఫ్ట్‌ (AGS) వాహనాలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని వెల్లడించింది. ఈరోజు నుంచే ధర తగ్గింపు అమల్లోకి వచ్చిందని కంపెనీ తన ఎక్ఛేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది. 

మారుతీ తగ్గింపు ప్రకటించిన ఏజీఎస్‌ వేరియంట్‌ వాహనాల్లో ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్-ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఫ్రాంక్స్, ఇగ్నిస్ ఉన్నాయి. ఈ మోడళ్లు రూ.5 వేల తగ్గింపు ధరతో లభించనున్నాయి. కార్ల ధరల్ని తగ్గిస్తున్న కారణాన్ని మాత్రం మారుతీ బయటపెట్టలేదు. అయితే ఏజీఎస్‌ వేరియంట్లను మరింత అందుబాటు ధరలోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించిన యూనియన్‌ బ్యాంక్‌.. లేటెస్ట్‌ రేట్లు ఇవే..

ఆటో గేర్ షిఫ్ట్ అనేది మారుతీ సుజుకీ 2014లో మొదటిసారి పరిచయం చేసిన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ. ఇది మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. అవసరాన్ని బట్టి దానికదే గేర్‌ మారిపోతుంటుంది. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పట్టణాల్లో ఏజీఎస్‌ ఉంటే డ్రైవింగ్‌ మరింత సులభమవుతుంది. అంతేకాదు ఇంధన సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు