Keechurallu Review: రివ్యూ: కీచురాళ్ళు.. మలయాళ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
మలయాళంలో విజయవంతమైన ‘కీడమ్’ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’లో ‘కీచురాళ్ళుగా’ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే?
చిత్రం: కీచురాళ్ళు; నటీనటులు: రజీషా విజయన్, శ్రీనివాసన్, విజయ్ బాబు, మణికందన్ తదితరులు; సంగీతం: సిద్ధార్థ ప్రదీప్; ఛాయాగ్రహణం: రాకేశ్ ధరణ్; ఎడిటింగ్: క్రిస్టీ సెబాస్టియన్; నిర్మాణ సంస్థలు: ఫస్ట్ ప్రింట్ స్టూడియోస్, ఫెయిరీ ఫ్రేమ్స్ ప్రొడక్షన్స్; దర్శకత్వం: రాహుల్ రిజీ నాయర్; ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఈటీవీ విన్.
థియేటర్లలో సందడి చేసిన పలు చిత్రాలు, ఒరిజినల్ మూవీస్, వెబ్‌సిరీస్‌లతోపాటు ఇతర భాషల్లో విజయాన్ని అందుకున్న ప్రాజెక్టులను తెలుగు ప్రేక్షకులకు అందించడంలో ముందుండే ఓటీటీ సంస్థ ‘ఈటీవీ విన్’(ETV Win). అలా ఇటీవల రిలీజైన వాటిలో ‘కీచురాళ్ళు’ (Keechurallu) ఒకటి. మలయాళంలో విజయవంతమైన ‘కీడం’ (Keedam)కు డబ్బింగ్ ఇది. రజీషా విజయన్ ప్రధాన పాత్రలో దర్శకుడు రాహుల్ రిజీ నాయర్ తెరకెక్కించారు. మరి, ఈ సినిమా కథేంటి? ఎలా ఉందంటే? (Keechurallu Review)..
కథేంటంటే?: రాధిక (రజీషా విజయన్) సైబర్ సెక్యూరిటీ నిపుణురాలు. సొంతగా స్టార్టప్ కంపెనీ నిర్వహిస్తూ ఉంటుంది. ఈమె ప్రతిభను గుర్తించిన పోలీసులు సైతం నేరస్థులను పట్టుకునేందుకు అప్పుడప్పుడు సహాయం కోరుతుంటారు. అలాంటి అమ్మాయినే ఓ యువకుడు తన గ్యాంగ్‌తో కలిసి కాల్స్, అసభ్య సందేశాలతో వేధిస్తుంటాడు. రాధికకు పరిచయస్థులైన పోలీసులు, న్యాయవాది అయిన తండ్రి కూడా విషయాన్ని పెద్దది చేయకపోవడం మంచిదని ఆమెకు సలహా ఇస్తారు. అయినా వారి మాట కాదని రాధిక ముందడుగేస్తుంది. మరి, స్క్రాప్ బిజినెస్ ముసుగులో ఆ రౌడీ గ్యాంగ్ చేస్తున్న అక్రమ కార్యకలాపాలేంటి? వారి నుంచి రాధికకు ఎదురైన సవాళ్లేంటి? ఎలా బుద్ధి చెప్పింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే (Keedam Review in Telugu).
ఎలా ఉందంటే?: కొందరు ఆకతాయిలు అమ్మాయిలకు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించడం, ఒకవేళ తమకు ఎదురు తిరిగితే బ్లాక్ మెయిల్ చేసి బెదిరించడం లేదా బయట ఎక్కడ కనిపించినా వార్నింగ్ ఇవ్వడం.. ప్రతి రోజూ ఏదో ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నేటి సమాజంలో నెలకొన్న ఈ సమస్యనే దర్శకుడు రాహుల్ రిజీ నాయర్ తనదైన శైలిలో తెరపైకి తీసుకొచ్చారు. అయితే, సైబర్ సెక్యూరిటీ నిపుణురాలే బాధితురాలిగా కాకుండా సాధారణ అమ్మాయి పాత్ర కోణంలో ఈ కథను చూపించే ఉంటే మరింత ఎఫెక్టివ్‌గా ఉండేది. సినిమాని ఆసక్తికరంగా ప్రారంభించిన దర్శకుడు అసలు కథలోకి వెళ్లేందుకు కాస్త సమయం తీసుకున్నారు. హీరోయిన్ వ్యక్తిత్వం ఎలాంటిది? టెక్నాలజీ సాయంతో మనుషులను ఎలా చదువుతుంది? అన్న విషయాలు తెలియజేసేలా రాసుకున్న సన్నివేశాలు బాగున్నా నెమ్మదిగా సాగడం సహనానికి పరీక్షే. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తే.. ఈసారి ఏ అఘాయిత్యానికి పాల్పడతారోనని ఎంతోమంది ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతుంటారు. న్యాయవాది అయినా సరే ఆ భయం తప్పదని హీరోయిన్ తండ్రి పాత్ర ద్వారా చూపించిన విధానం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇలా తండ్రి సపోర్ట్ లేకపోయినా రంగంలోకి దిగిన రాధిక చేసే పోరాటం స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తుంది.
రాధికను టార్గెట్ చేసిన విలన్ గ్యాంగ్‌కు హెడ్ ఎవరు? వీరి నెట్వర్క్ ఏంటి? వంటి వాటినీ లోతుగా చూపించి ఉంటే మరింత పవర్‌ఫుల్‌గా ఉండేది. ఆయా క్యారెక్టర్లలను సింపుల్‌గా తేల్చేయడంతో హీరోయిన్ చేసే టెక్నాలజీ మ్యాజిక్ అలరించినా ఏదో వెలితి ఉన్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. ఫస్టాఫ్‌లో.. టెక్నాలజీతో టార్చర్ చేసిన వారిని అదే టెక్నాలజీతో బుద్ధి చెప్పిన రాధిక ప్లానింగ్‌ను సెకండాఫ్‌లో రివీల్ చేసిన తీరు బాగుంది. ఉత్కంఠభరితంగా ప్రీ క్లైమాక్స్‌ను క్రియేట్ చేశారు. పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్టే ఉంటాయి.
ఎవరెలా చేశారంటే?: తక్కువ పాత్రలతో రూపొందిన సినిమా ఇది. రజీషా విజయన్‌కే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ. సమస్య వస్తే దిగులుపడకుండా తెగువ చూపే అమ్మాయి రాధిక పాత్రలో ఆమె ఒదిగిపోయారు. రజీషా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘రామారావు ఆన్ డ్యూటీ’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు రాహుల్ హీరోయిన్ కొలీగ్ రోల్లో సందడి చేశారు. రాధిక తండ్రిగా కనిపించిన శ్రీనివాసన్, పోలీసు పాత్రలు పోషించిన వారు, రౌడీ గ్యాంగ్ పరిధి మేరకు నటించారు. సాంకేతిక బృందం విషయానికొస్తే.. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం ఓకే. 1:45 గం.ల నిడివితో సినిమాని క్రిస్పీగా ఎడిట్ చేశారు. వాస్తవికతకు దగ్గరగా ఉన్న కథలను తెరకెక్కించడం తన ప్రత్యేకత అని రాహుల్ మరోసారి చాటుకున్నారు.
కుటుంబంతో కలిసి చూడొచ్చా?: ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమే ఇది. ఒక్క చోట మినహా అసభ్యకరమైన సంభాషణలు లేవు. సన్నివేశాలూ లేవు.
- బలాలు:
- + కథ
- + రజీషా విజయన్ నటన
- బలహీనతలు:
- - ప్రథమార్ధంలో కొంత సాగదీత
- - పేలవమైన పలు విలన్ పాత్రలు
- చివరిగా: రాధిక పోరాటం.. ఆసక్తికరం
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాయన్’ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరించిందా? -
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్‌తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన ‘పురుషోత్తముడు’ మూవీ ప్రేక్షకులను అలరించిందా? -
రివ్యూ: బహిష్కరణ.. అంజలి వేశ్యగా నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
హీరోయిన్ అంజలి, శ్రీతేజ ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘బహిష్కరణ’. ‘జీ 5’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ రివ్యూ మీకోసం.. -
రివ్యూ: బ్యాడ్ న్యూజ్.. విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ మూవీ అలరించిందా?
Bad Newz movie review: విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ ఎంటర్టైన్ ఎలా ఉంది? -
రివ్యూ: డార్లింగ్.. ప్రియదర్శి, నభానటేష్‌ల కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా?
ప్రియదర్శి, నభానటేష్ జంటగా నటించిన రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే? -
రివ్యూ: భారతీయుడు2.. కమల్, శంకర్ కాంబో మరోసారి హిట్ అయిందా?
indian 2 review: కమల్‌హాసన్, సిద్ధార్థ్, రకుల్ కీలక పాత్రల్లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు2’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ధూమం.. ఫహద్ ఫాజిల్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
ఫహద్ ఫాజిల్, అపర్ణా బాలమురళి కీలక పాత్రల్లో నటించిన ‘ధూమం’ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?
సోనియా సింగ్, పవన్ సిద్ధు నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే! -
రివ్యూ: వెబ్‌సిరీస్: మీర్జాపూర్ సీజన్-3.. క్రైమ్, యాక్షన్ సిరీస్-3 మెప్పించిందా?
Mirzapur Season 3 Review: యువతను విశేషంగా ఆకట్టుకున్న సిరీస్‌ల్లో మీర్జాపూర్ ఒకటి. ఇప్పుడు మూడో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: ‘గురువాయూర్ అంబలనాదయిల్’.. మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
Guruvayoor Ambalanadayil Review: పృథ్వీరాజ్ సుకుమార్, బసిల్ జోసెఫ్ కీలక పాత్రల్లో విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ‘గురువాయూర్ అంబలనాదయిల్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: ‘కల్కి 2898 ఏడీ’.. ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఎలా ఉంది?
kalki 2898 ad review in telugu: ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: యక్షిణి.. సోషియో ఫాంటసీ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
Yakshini review in telugu: వేదిక, రాహుల్ విజయ్, మంచు లక్ష్మీ, అజయ్ కీలక పాత్రల్లో నటించిన ‘యక్షిణి’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
రివ్యూ: పరువు.. నివేదా పేతురాజ్ నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj), నటుడు నరేశ్ అగస్త్య (Naresh Agastya), నాగబాబు (Nagababu) ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘పరువు’ (paruvu). ‘జీ 5’లో విడుదలైన ఈ సిరీస్ రివ్యూ మీకోసం.. -
రివ్యూ: హరోం హర.. సుధీర్‌బాబు ఖాతాలో హిట్ పడిందా?
సుధీర్‌బాబు, మాళవిక శర్మ, సునీల్ కీలక పాత్రల్లో నటించిన ‘హరోం హర’ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మహారాజ.. విజయ్ సేతుపతి 50వ మూవీ మెప్పించిందా?
Maharaja Review: వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న విజయ్‌సేతుపతి కెరీర్లో 50వ చిత్రం ‘మహారాజ’. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఏ మేరకు మెప్పించింది? -
రివ్యూ: మిరల్.. ‘ప్రేమిస్తే’ భరత్ నటించిన చిత్రం భయపెట్టిందా?
ప్రేమిస్తే సినిమా హీరో భరత్ నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘మిరల్’. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. రివ్యూ మీకోసం.. -
రివ్యూ: కల్కి.. టొవినో థామస్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉంది?
మలయాళంలో మంచి టాక్ సొంతం చేసుకున్న టొవినో థామస్ యాక్షన్ ఫిల్మ్ ‘కల్కి’ మెప్పించిందా? -
రివ్యూ: మనమే.. శర్వానంద్, కృతిశెట్టిల మూవీ ఎలా ఉంది?
Manamey Movie Review: శర్వానంద్, కృతిశెట్టి జంటగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా మెప్పించిందా? -
రివ్యూ: సత్యభామ.. కాజల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ టాక్ ఏంటి?
కాజల్ ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో వచ్చిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి: జాన్వీకపూర్ స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
Mr And Mrs Mahi Review: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా శరణ్ శర్మ తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉంది?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్‌మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్‌లో రకుల్‌ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్‌రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్