logo
Published : 29/11/2021 05:46 IST

తుపాను ప్రభావం.. మొదలైన వాన

బాపట్ల, రేపల్లెలో భారీగా వర్షం

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో తుపానుతో జిల్లావ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. ఆదివారం ఉదయం నుంచి మొదలైన వర్షం రాత్రి పొద్దుపోయే వరకు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. చల్లని గాలులు, జోరు వర్షంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఆదివారం బయటకు వద్దామనుకునే వారికి వర్షం ఆటంకంగా మారింది. గుంటూరు నగరంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. తేలికపాటి వర్షాలకు కూడా నగరంలోని పలు దారుల్లో నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నగరవాసులు వర్షంలోనే రాకపోకలు సాగించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వర్షం తీవ్ర ఆటంకాన్ని కల్గించింది. మొన్నటి వరకు వర్షపు నీటిలో ఉన్న పొలాల్లో ఇప్పుడు మళ్లీ నీరు చేరింది. తుపాను నేపథ్యంలో అధికార యంత్రాంగం తీర ప్రాంత అధికారులను అప్రమత్తం చేసింది. తీర ప్రాంత మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఒక ప్రకటనలో సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని