logo
Published : 03/12/2021 04:58 IST

ఆ నేరగాడి కోసం..

ఈనాడు-అమరావతి

ఆ నేరగాడి కోసం గుజరాత్‌, కేరళ, మహారాష్ట్రలకు చెందిన మూడు రాష్ట్రాల పోలీసు అధికారులు విచారణ నిమిత్తం తమకు అప్పగించాలంటే తమకు అప్పగించాలని గుంటూరు అర్బన్‌ పోలీసుల వద్దకు వరస కడుతున్నారు. ఆ మోస్ట్‌ క్రిమినల్‌ను గుంటూరు అర్బన్‌ పోలీసులు ఓ కేసులో అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఇంతకీ ఆ అంతరాష్ట్ర నేరగాడు ఎవరు? అతనికి, గుంటూరుకు సంబంధం ఏమిటో తెలుసుకుందామా!!

గుంటూరు నల్లపాడు పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉండే కులదీప్‌సింగ్‌ రాజ్‌పురోహిత్‌ మిర్చి ఎగుమతి వ్యాపారి. తన సరకును గుజరాత్‌కు చెందిన రాకేష్‌ పటేల్‌ మధ్యవర్తిగా ఉండి చైనా దేశానికి ఓ ఎగుమతి వ్యాపారికి విక్రయించానని, అందుకు సంబంధించిన నగదు అడుగుతుంటే తనపై దాడికి యత్నించారని రాజ్‌పురోహిత్‌  అక్టోబరులో నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతులకు చెందిన రూ.కోట్ల విలువైన సరకును రాకేష్‌ పటేల్‌ తీసుకుని విక్రయించుకున్నారని ధ్రువీకరించుకున్న  పోలీసులు అతన్ని పట్టుకోడానికి  గుజరాత్‌లో మకాం వేశారు. ఫోన్లపై నిఘా పెట్టి సాంకేతిక పరిజ్ఞానంతో రెండు వారాల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు జైల్లో నిందితుడు ఉన్నారు.  పోలీసులు విచారించే క్రమంలో అతని నేరాల చిట్టా బయటపడింది. ఇతని మోసాలపై గుజరాత్‌, మహారాష్ట్ర, కేరళలో  కేసులు ఉన్నాయని గుంటూరు సౌత్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, కేసు దర్యాప్తులో సహకారం అందిస్తున్న ఎస్సై కిశోర్‌లు తెలిపారు. కొద్ది రోజుల్లో కేసును చేదిస్తామని ఎస్పీ హఫీజ్‌ చెబుతున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని