logo

ఆశీర్వాదాలు.. పరామర్శలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి గుంటూరు నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెదేపా నాయకుల ఇళ్లలో నిర్వహించిన

Published : 09 Dec 2021 04:05 IST

గుంటూరులో చంద్రబాబు పర్యటన

పుష్పరాజ్‌ కుటుంబ సభ్యులతో చంద్రబాబు

పట్టాభిపురం, న్యూస్‌టుడే : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి గుంటూరు నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెదేపా నాయకుల ఇళ్లలో నిర్వహించిన శుభకార్యాలకు విచ్చేసిన ఆయనకు చుట్టుగుంట సెంటర్‌ వద్ద తెదేపా జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్‌ నసీర్‌, తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, ఐటీడీపీ కార్యదర్శి బెల్లంకొండ సురేష్‌ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి చంద్రబాబు శ్యామలానగర్‌ రైల్వే గేటు వద్ద ఉన్న ఎమ్‌.ఎన్‌.ఆర్‌. కన్వెన్షన్‌ సెంటర్‌ వద్దకు చేరుకున్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు కుమారుడు విషువర్దన్‌, రమ్యల వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇటీవల కరోనా బారిన పడి కోలుకుంటున్న మాజీ మంత్రి జె.ఆర్‌. పుష్పరాజ్‌ను ఎస్‌.వి.ఎన్‌. కాలనీలోని ఆయన నివాసంలో పరామర్శించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌ రావాలని సూచించారు. అనంతరం చంద్రబాబు శుభం కన్వెన్షన్‌ సెంటర్‌లో లేపాక్షి హస్త కళల సంస్థ మాజీ డైరెక్టర్‌ వట్టికూటి హర్షవర్దన్‌ కుమారుడి వివాహానికి విచ్చేసి వధూవరులు యామిని సాయి, అశోక్‌వర్దన్‌ను ఆశీర్వదించారు. వసంతరాయపురంలోని రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్‌కుమార్‌, జీవీ ఆంజనేయులు, గుంటూరు పశ్చిమ ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

శుభం కన్వెన్షన్‌లో వధూవరులు యామినిసాయి, వట్టికూటి అశోక్‌వర్దన్‌లతో చంద్రబాబు

ఎమ్‌.ఎన్‌.ఆర్‌ కన్వెన్షన్‌లో వధూవరులు రమ్య, కనపర్తి విష్ణువర్దన్‌లతో..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని