logo

సీఐపై సస్పెన్షన్‌ ఎత్తివేత?

ఇటీవల సస్పెన్షన్‌కు గురైన వినుకొండ రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవటానికి రంగం సిద్ధమైంది. అయితే ఆయనకు మాత్రం పోస్టింగ్‌ ఇవ్వలేదు.

Published : 17 Jan 2022 04:55 IST

ఈనాడు, అమరావతి:  ఇటీవల సస్పెన్షన్‌కు గురైన వినుకొండ రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవటానికి రంగం సిద్ధమైంది. అయితే ఆయనకు మాత్రం పోస్టింగ్‌ ఇవ్వలేదు. అధికార పార్టీకే చెందిన వైకాపా కార్యకర్త, రైతు అయిన జి.నరేంద్రపై అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టి ఇబ్బంది పెట్టడం, జైలుకు పంపటం వంటివి ఇటీవల అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య రచ్చకు దారితీసిన సంగతి విదితమే.   కేసు నమోదుకు దారితీసిన పరిస్థితులపై గుంటూరు రూరల్‌ అదనపు ఎస్పీ రిశాంత్‌రెడ్డి క్షేత్రస్థాయిలో విచారించి నివేదిక సమర్పించారు. వారం తిరగకుండానే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సదరు అధికారిపై సస్పెన్షన్‌  ఎత్తివేసి తిరిగి అదే స్టేషన్‌లో పోస్టింగ్‌ ఇప్పించుకోవటానికి ప్రయత్నాలు చేశారని అది ఉన్నత స్థాయిలో సఫలమైనట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని