logo

అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్‌

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్‌ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

Published : 19 Apr 2024 02:37 IST

ర్యాలీలో పాల్గొన్న పెద్దిరెడ్డి, వెంకటేగౌడ

పలమనేరు, న్యూస్‌టుడే: నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్‌ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే వెంకటేగౌడ నామినేషన్‌ దాఖలు చేయడానికి మునుపు పట్టణంలో భారీ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. మరోమారు అవకాశమివ్వాలని వెంకటేగౌడ ప్రజలను కోరారు. ఉదయం ఎద్దులచెరువు కట్టమీదున్న ఓంశక్తి ఆలయంలో పూజలు చేసి నామపత్రాలు దాఖలు చేశారు. పట్టణానికి చెందిన వ్యాపారి గణేష్‌యాదవ్‌ పెద్దిరెడ్డి సమక్షంలో వైకాపాలో చేరారు.

మద్యం దుకాణం వద్ద కార్యకర్తలు

ఏరులై పారిన మద్యం.. ర్యాలీ సందర్భంగా మండలాల నుంచి జనసమీకరణ చేశారు. వారంతా మద్యం సేవిస్తూ కనిపించింది. మద్యం దుకాణాల ఎదుట, బహిరంగ ప్రాంతాలు, రహదారులపైనే తాగుతూ కనిపించారు. వారంతా వైకాపా జెండాలు, టోపీలు ధరించి కనింపించారు.  

హడావుడిగా పారిశుద్ధ్య పనులు.. అమ్మవారి ఆలయం నిత్యం అపరిశుభ్రత కనిపించేది. చెరువులోని మురుగుతో దుర్వాసన, చెత్త నిల్వలతో దుర్గంధం వెలువడేది. మంత్రి, ఎమ్మెల్యే పూజలు చేస్తారని చెప్పడంతో ఆ ప్రాంతాన్ని పురపాలిక సిబ్బంది హడావుడిగా శుభ్రం చేశారు. గతంలో పలుమార్లు ఈ విషయాన్ని స్థానికులు అధికారులకు విన్నవించినా స్పందన లేదని, ప్రజాప్రతినిధులు వస్తున్నారడంతో ఇలా చేశారని ముక్కున వేలేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని