logo

న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం

కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసమూర్తి,

Published : 19 Apr 2024 02:47 IST

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు

బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తి శ్రీనివాసమూర్తిని సత్కరిస్తున్న బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేంద్రరెడ్డి, అశోక్‌ఆనంద్‌యాదవ్‌

చిత్తూరు (న్యాయవిభాగం), న్యూస్‌టుడే: కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణకుమార్‌కు గురువారం రాత్రి బార్‌ అసోసియేషన్‌ భవనంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ బెంచ్‌కు.. బార్‌కు సత్సంబంధాలు బాగున్నప్పుడు కక్షిదారులకు న్యాయం జరుగుతుందన్నారు. బదిలీపై వెళ్తున్న ఇద్దరు న్యాయమూర్తులు బాగా పనిచేసి ఎన్నో కేసులు పరిష్కరించి అందరి మన్ననలు పొందారన్నారు. అనంతరం బదిలీపై వెళుతున్న న్యాయమూర్తులు శ్రీనివాసమూర్తి, కరుణకుమార్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి శాంతి, న్యాయమూర్తులు ఉమాదేవి, మాధవి, వెన్నెల, శ్రీనివాసులు, కీర్తన, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజేంద్రరెడ్డి, ప్రధాన కార్యదర్శి అశోక్‌ఆనంద్‌యాదవ్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

కరుణకుమార్‌ను సత్కరిస్తున్న బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని