logo
Published : 29/11/2021 02:02 IST

ఫులె బాటలో పయనిద్దాం


నివాళి అర్పిస్తున్న ప్రజాప్రతినిధులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సమాజంలో స్త్రీ విద్యకు ఆద్యుడు.. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం పరితపించిన మహనీయుడు.. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని చాటిచెప్పిన మహాత్మా జ్యోతిరావు ఫులె బాటలో పయనిద్దామని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ సూచించారు. కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఫులె వర్ధంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఫులె విగ్రహానికి జడ్పీ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌, డీఆర్వో సత్తిబాబుతో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సీఎం జగన్‌, మహిళలకు పదవుల్లో 50 శాతం కేటాయిస్తూ ఫులె స్ఫూర్తి చాటుతున్నారన్నారు. కాకినాడ ఉప మేయర్‌-1 మీసాల ఉదయకుమార్‌, ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ, బీసీ కార్పొరేషన్‌ ఈడీ సుబ్బలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ డీడీ మయూరి తదితరులు పాల్గొన్నారు.

Read latest East-godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని