logo

కాకినాడ గ్రామీణంలో 19.. పెద్దాపురంలో 15

కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్‌టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు.

Updated : 19 May 2024 04:15 IST

ఇదీ ఓట్ల లెక్కింపు రౌండ్ల సంఖ్య
న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌

కౌంటింగ్‌ కేంద్రంలో పరిశీలిస్తున్న కలెక్టర్‌

కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్‌టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు. ఇక్కడ కాకినాడ పార్లమెంట్‌తో పాటు, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలు, వీవీ పాట్స్, పోలింగ్‌ సామగ్రి స్ట్రాంగ్‌రూముల్లో భద్రపర్చారు. ఒక్కో నియోజకవర్గంలో పార్లమెంట్, అసెంబ్లీకి సంబంధించి ఈవీఎంల్లో ఓట్లను లెక్కించడానికి స్ట్రాంగ్‌రూములకు అనుసంధానంగా కౌంటింగ్‌ కేంద్రాలను తీర్చిదిద్దుతున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బందిని కేటాయించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కలెక్టరేట్‌ అధికారులు సేకరిస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి సాఫ్ట్‌వేర్‌  కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ విభాగానికి చేరింది. దీని ప్రకారం ఉద్యోగుల వివరాలను నమోదు చేస్తున్నారు. మూడు విడతల్లో వీరిని వివిధ నియోజకవర్గాలకు కేటాయించనున్నారు.  సొంత నియోజకవర్గం, విధులు నిర్వహించే ప్రదేశం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కౌంటింగ్‌ సిబ్బందిని నియమిస్తారని కలెక్టరేట్‌ అధికారులు చెబుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు 200 మంది చొప్పున సిబ్బందిని వినియోగిస్తారు. 
కాకినాడ గ్రామీణంలో ఎక్కువ రౌండ్లు..? : కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,640 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కాకినాడ గ్రామీణం నియోజకవర్గంలో 264 పోలింగ్‌కేంద్రాలు ఉండగా, ఇక్కడ అత్యధికంగా 19 రౌండ్లు ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని