logo

ముంపు నివారణకు తాత్కాలిక చర్యలు

వర్షాకాలంలో రానున్న వరద నుంచి ముంపు ప్రాంతాలను రక్షించేందుకు నగరవ్యాప్తంగా నాలా నిర్మాణ పనులు, మరమ్మతులు చేపట్టామని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. పనులు జరుగుతోన్న ప్రాంతాల్లో వరదలొస్తే.. కాలనీలు ముంపునకు గురికాకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేశామని తెలిపింది.

Published : 21 May 2022 06:00 IST

‘ఈనాడు’ కథనానికి స్పందించిన జీహెచ్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాకాలంలో రానున్న వరద నుంచి ముంపు ప్రాంతాలను రక్షించేందుకు నగరవ్యాప్తంగా నాలా నిర్మాణ పనులు, మరమ్మతులు చేపట్టామని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. పనులు జరుగుతోన్న ప్రాంతాల్లో వరదలొస్తే.. కాలనీలు ముంపునకు గురికాకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేశామని తెలిపింది. రెండేళ్ల క్రితం అతి భారీ వర్షాలతో రోజుల తరబడి నీట మునిగిన ప్రాంతాల్లో నాలాల నిర్వహణ, మరమ్మతు పనులు పూర్తికాకపోవడంపై శుక్రవారం ‘ఈనాడు’లో ‘తరుణం ముంపుకొస్తోంది’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఇంజినీర్లు స్పందించారు. జీహెచ్‌ఎంసీతోపాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎస్‌ఎన్‌డీపీ కింద చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు. వరద సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.954 కోట్లతో 60 పనులు చేపట్టామంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని