KCR: భారాస అధినేత కేసీఆర్‌ బస్సు యాత్ర షెడ్యూల్‌ ఖరారు

భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.

Published : 19 Apr 2024 16:06 IST

హైదరాబాద్‌: తెలంగాణ గొంతుకే అజెండాగా, పార్టీకి పూర్వవైభవమే ధ్యేయంగా భారత రాష్ట్ర సమితి (BRS) లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఏప్రిల్‌ 22 నుంచి మే 10 వరకు బస్సు యాత్ర షెడ్యూల్‌ ఖరారైంది. కాంగ్రెస్, భాజపా వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు భారాస హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచారం కొనసాగించనున్నారు. యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని