logo

‘మహస్వి’కి 102వ ర్యాంకు

టీఎస్‌ ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఖమ్మం న్యూవిజన్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని జి.మహస్వి రాష్ట్రస్థాయిలో 102వ ర్యాంకు సాధింది. జేఈఈ మెయిన్స్‌లో సైతం ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 732వ ర్యాంకు సాధించటం విశేషం.

Published : 19 May 2024 04:49 IST

జి.మహిస్వి

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: టీఎస్‌ ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఖమ్మం న్యూవిజన్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని జి.మహస్వి రాష్ట్రస్థాయిలో 102వ ర్యాంకు సాధింది. జేఈఈ మెయిన్స్‌లో సైతం ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 732వ ర్యాంకు సాధించటం విశేషం. పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్మీడియట్‌లో 987 సాధించి ప్రతిభను నిరూపించుకుంది. తండ్రి గనిపిశెట్టి భాస్కర్‌రావు, మాధవి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే.


చదువుల కిరణానికి 278..

కిరణ్మయి 

పాల్వంచ, న్యూస్‌టుడే: పాల్వంచ పట్టణానికి చెందిన కాంపెల్లి కనకేశ్, సంధ్య దంపతుల కుమార్తె కిరణ్మయి ‘ఈఏపీసెట్‌’ ఫలితాల్లో ప్రతిభ చూపింది. ఫార్మసీ విభాగంలో 278 ర్యాంకు సాధించింది. చిన్నతనం నుంచి చదువుల్లో చురుగ్గా ఉండే కిరణ్మయి పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్‌ బైపీసీలో 973 మార్కులు సాధించింది. వైద్యరంగంలో స్థిరపడటమే తన లక్ష్యమని కిరణ్మయి ‘న్యూస్‌టుడే’తో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని