logo
Published : 29/11/2021 04:03 IST

సచివాలయాల నిర్మాణంపై దృష్టి: ఎమ్మెల్యే

మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొన్న సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు

కైకలూరు,న్యూస్‌టుడే: ప్రభుత్వ పరిపాలన విధానాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో గ్రామ సచివాలయ వ్యవస్థకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గ్రామాల్లో నూతన సచివాలయ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. నిర్మాణాలకు సాంకేతికంగా ఇబ్బందులు ఉన్న గ్రామాల్లో అధికారులు వాటిని పరిష్కరిస్తారని తెలిపారు. వీటితో పాటు రైతు భరోసా, ఆరోగ్య ఉపకేంద్రాలు, మిల్క్‌ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. చెరుకువాడ బలరామరాజు, బి.శ్రీనివాసరావు, ఘంటసాల సురేష్‌, జయదేవ్‌, నున్న రాంబాబు, తిరుపతిరాజు, పండు గాంధీ, సాధుకొండయ్య, లక్ష్మి, బాలమ్మ, శ్యామసుందర్‌ పాల్గొన్నారు.

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని