logo
Updated : 01/12/2021 16:23 IST

రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీ

మోపిదేవి: రైతులకు ప్రభుత్వం రాయితీపై వివిధ రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తోందని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేశ్‌ బాబు పేర్కొన్నారు. మండల పరిధిలోని కోసూరిపాలెంలో రైతులు ఏర్పాటు చేసిన గ్రూపుకు రూ.26లక్షల విలువగల వరి కోత యంత్రాన్ని పంపిణీ చేశారు. మరో గ్రూపుకు రూ.8లక్షలు విలువ గల వివిధ పంటలకు వినియోగించే యంత్ర పరికరాలను అందజేశారు. వీటిని సద్వినియోగం చేసుకొని తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచి అనూష, ఎంపీటీసీ సభ్యుడు రాజేష్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ నర్సింహారావు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. 

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని