logo

మా ట్రాక్టర్‌ను పట్టుకోవడానికి ఎన్ని గుండెలు ?

మా ఇలాకాలోకి వచ్చి మా ట్రాక్టరునే పట్టుకుంటారా మీ కెంత ధైర్యం.. ఇది మా అడ్డా మీ పెత్తనం ఏంటంటూ కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన ఓ వైకాపా నేత ప్రైవేట్‌ విజిలెన్స్‌ సంస్థ ప్రతినిధిపై బెదిరింపులకు దిగిన ఘటన శనివారం పత్తికొండలో చోటు చేసుకుంది.

Published : 04 Dec 2022 01:13 IST

ప్రైవేటు సంస్థ విజిలెన్స్‌ ప్రతినిధులపై వైకాపా నాయకుడి బెదిరింపులు

సంస్థ ప్రతినిధులతో వాదనకు దిగిన వైకాపా నాయకులు

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: మా ఇలాకాలోకి వచ్చి మా ట్రాక్టరునే పట్టుకుంటారా మీ కెంత ధైర్యం.. ఇది మా అడ్డా మీ పెత్తనం ఏంటంటూ కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన ఓ వైకాపా నేత ప్రైవేట్‌ విజిలెన్స్‌ సంస్థ ప్రతినిధిపై బెదిరింపులకు దిగిన ఘటన శనివారం పత్తికొండలో చోటు చేసుకుంది. పత్తికొండ మండలం కనకదిన్నె, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లోని వాగులు, వంకల నుంచి అధికార పార్టీ నాయకులు, వారి అండ దండ కలిగిన ట్రాక్టర్‌ యజమానులు గత కొంత కాలంగా ఇసుకను అక్రమంగా తవ్వి తరలించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఇసుకను తవ్వుకొని విక్రయించేందుకు జేపీ పవర్‌ ఇన్‌ఫ్రా ప్రైవేటు సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. అయినా పత్తికొండ ప్రాంతంలోని ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ నాయకులు కొందరు ప్రతినిధుల కళ్లు గప్పి ఇసుకను తరలిస్తున్నారు. శనివారం కనకదిన్నె వాగు వైపు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టరును ఆ సంస్థ విజిలెన్స్‌ ప్రతినిధి విజయ్‌భాస్కర్‌ ఆధ్వర్యంలో పట్టుకొని స్థానిక పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. సమాచారం అందుకున్న కోతిరాళ్ల గ్రామ వైకాపా ఎంపీటీసీ సభ్యుడు కృష్ణారెడ్డి కొందరు ట్రాక్టర్‌ యజమానులు, డ్రైవర్లతో కలసి పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకొని సంస్థ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. మా ప్రాంతంలో మేం తప్ప మరెవరు ఇసుక తరలించడానికి వీల్లేదంటూ హల్‌చల్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని