logo

కదంతొక్కిన పసుపు దళం

శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.

Published : 19 Apr 2024 02:42 IST

న్యూస్‌టుడే, ఆత్మకూరు: శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. తర్వాత సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు. అక్కడి నుంచి అయ్యప్పస్వామి ఆలయానికి వెళ్లారు. మధ్యాహ్నం 1.26 గంటలకు నామపత్రాలపై సంతకం చేసి స్వయంగా కారు నడుపుకొంటూ తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి నామపత్రం దాఖలు చేశారు.

అనంతరం ఆత్మకూరులోని గౌడ్‌ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఈసారి తెదేపా జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, బుడ్డా సతీమణి శైలజ, కుమార్తె మేఘనారెడ్డి, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని