logo

సీసీఎస్‌ సీఐ సస్పెన్షన్‌

సంగారెడ్డి సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌) సీఐ ఎం.వెంకట సాయికిషోర్‌పై సస్సెన్షన్‌ వేటు పడింది. మల్టీజోన్‌-2 ఐజీ సుధీర్‌బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 20 May 2024 04:39 IST

వెంకట సాయికిషోర్‌ 

సంగారెడ్డి అర్బన్, న్యూస్‌టుడే: సంగారెడ్డి సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌) సీఐ ఎం.వెంకట సాయికిషోర్‌పై సస్సెన్షన్‌ వేటు పడింది. మల్టీజోన్‌-2 ఐజీ సుధీర్‌బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట సాయి కిషోర్‌పై జిల్లాలో పలు రకాల అరోపణలు రావడంతో శాఖాపరంగా చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నెల క్రితం ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేయగా..  సీసీఎస్‌ విభాగంలో సీఐగా పోస్టింగ్‌ ఇచ్చారు. తాజాగా సస్పెన్షన్‌కు గురికావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని