Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 01 Jun 2024 21:01 IST

1.అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ట్యాంక్‌బండ్‌, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ ప్రాంతాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. పూర్తి కథనం

2. అందుకే నేను ఇంటర్వ్యూలు ఇవ్వను: ఫహాద్‌ ఫాజిల్‌

‘పుష్ప’ (Pushpa) సినిమాలోని ఇన్‌స్పెక్టర్‌ భన్వర్‌సింగ్‌ షెకావత్‌ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil). ఇటీవల ‘ఆవేశం’ (Aavesham) చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఈసందర్భంగా ఓ మీడియా సంస్థ ఆయనతో ముచ్చటించింది. పూర్తి కథనం

3. నయనతారతో టూర్‌.. ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టిన విఘ్నేశ్‌ శివన్‌

కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan)- హీరోయిన్‌ నయనతార (Nayanthara) దంపతులు తమ పిల్లలతో కలిసి విహారయాత్రలు చేస్తున్నారు. సంబంధిత ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. పూర్తి కథనం

4. క్రికెట్‌ VS బేస్‌బాల్‌.. రెండింటి మధ్య తేడా అదేనని చెప్పా: యువరాజ్‌

టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) కోసం ఐసీసీ నియమించిన రాయబారుల్లో భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) ఉన్నాడు. జూన్ 2 (భారత కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటలకు) పొట్టి కప్‌ యూఎస్‌ఏ - విండీస్‌ సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభం కానుంది. పూర్తి కథనం

5. వాహన ధరల్ని తగ్గించిన మారుతీ సుజుకీ.. ఏ మోడళ్లపై అంటే?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ  (Maruti Suzuki Sales) ఓ కీలక ప్రకటన చేసింది. తన కార్ల ధరను తగ్గించినట్లు పేర్కొంది. ఆటో గేర్‌ షిఫ్ట్‌ (AGS) వాహనాలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని వెల్లడించింది. పూర్తి కథనం

6. ‘మా అమ్మే నాపై దాడి చేయించింది’: రూ.11వేల కోట్ల సామ్రాజ్యంలో వారసత్వ పోరు

రూ.11వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో వారసత్వ పోరు మరింత ముదిరి, రచ్చకెక్కింది. తల్లే తనపై దాడి చేయించిందని ఓ బిలియనీర్ పోలీసులను ఆశ్రయించారు. ప్రముఖ పొగాకు ఉత్పత్తుల సంస్థ గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ (Godfrey Phillips) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్‌ మోదీ (Samir Modi) పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పూర్తి కథనం

7. వాట్సప్‌లో ట్రేడింగ్‌ పేరుతో.. వ్యాపారి నుంచి రూ.9 కోట్లు స్వాహా

సైబర్‌ నేరగాళ్లు (Cyber Fraudsters) నానాటికీ కొత్తతరహా మోసాలకు తెర తీస్తున్నారు. ఈ మధ్య వాట్సప్‌ గ్రూపు (WhatsApp group)ల్లో స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలు కలవరపెడుతున్నాయి.  పూర్తి కథనం

8. పీవోకే విదేశీ భూభాగమే.. అంగీకరించిన పాకిస్థాన్‌!

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK) విదేశీ భూభాగమని పాకిస్థాన్‌ ప్రభుత్వం (Pakistan Govt) ఇస్లామాబాద్‌ హై కోర్టులో (Islamabad High Court) అంగీకరించింది. అక్కడ పాకిస్థాన్‌ చట్టాలు చెల్లబోవని చెప్పింది. పాత్రికేయుడి కిడ్నాప్‌ కేసుపై శుక్రవారం విచారణ సందర్భంగా పాకిస్థాన్‌ అదనపు అటార్నీ జనరల్‌ ఇస్లామాబాద్‌ కోర్టులో ఈమేరకు వ్యాఖ్యానించారు. పూర్తి కథనం

9. సీఎం రేవంత్‌రెడ్డికి భారాస అధినేత కేసీఆర్‌ 22 పేజీల సుదీర్ఘ లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భారాస అధినేత కేసీఆర్‌ 22 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రావాలని ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాన  బహిరంగ లేఖ రాస్తున్నట్టు తెలిపారు. ‘‘ తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితం.. అమరుల త్యాగాల పర్యవసానం. పూర్తి కథనం

10. 40 శాతం కమీషన్‌ కేసులో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లకు బెయిల్‌

పరువు నష్టం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు (DK Shivakumar) ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు  (MP/MLA Court)బెయిల్‌ మంజూరు చేసింది.  పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని