logo

‘అద్విత’ంగా ప్రతిభ చూపి..!

మిర్యాలగూడ పట్టణానికి చెందిన బిక్కుమళ్ల అద్విత్‌ కృష్ణ ఈఏపీసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 275 ర్యాంకు సాధించాడు. పట్టణంలోని కేఎల్‌ఎన్‌ జూనియర్‌ కళాశాల కరస్పాండెంట్‌ బిక్కుమళ్ల కిరణ్‌కుమార్, శైలజ దంపతుల కుమారుడు అద్విత్‌ కృష్ణ స్థానికంగా కళాశాలలో ఇంటర్‌ బైపీసీ 958 మార్కులతో పూర్తిచేశాడు.

Published : 19 May 2024 02:53 IST

బిక్కుమళ్ల అద్విత్‌ కృష్ణ

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: మిర్యాలగూడ పట్టణానికి చెందిన బిక్కుమళ్ల అద్విత్‌ కృష్ణ ఈఏపీసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 275 ర్యాంకు సాధించాడు. పట్టణంలోని కేఎల్‌ఎన్‌ జూనియర్‌ కళాశాల కరస్పాండెంట్‌ బిక్కుమళ్ల కిరణ్‌కుమార్, శైలజ దంపతుల కుమారుడు అద్విత్‌ కృష్ణ స్థానికంగా కళాశాలలో ఇంటర్‌ బైపీసీ 958 మార్కులతో పూర్తిచేశాడు. అన్ని సబ్జెక్టులపై సమగ్ర పట్టు సాధించేందుకు పాఠ్యపుస్తకాలు చదివినట్లు అద్విత్‌ కృష్ణ తెలిపారు. కళాశాలలో అధ్యాపకుల సూచనలతో ప్రతిరోజు 10 గంటలకు పైగా చదివినట్లు తెలిపారు. నీట్‌ సాధించి డాక్టర్‌ అవ్వాలనేది తన లక్ష్యమని అద్విత్‌ కృష్ణ తెలిపాడు.

జాహ్నవిరెడ్డికి 574 ర్యాంకు

మాడ్గులపల్లి: మండలంలోని ఇందుగుల గ్రామానికి చెందిన కల్లు జాహ్నవిరెడ్డికి టీఎస్‌ ఈఏపీసెట్‌లో 574వ ర్యాంకు లభించింది. అంతకు ముందు నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌లో 1237వ ర్యాంకు సాధించింది. ఇదే నెలల నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు లభిస్తే ఐఐటీ లేదంటే, ఇంజినీరింగ్‌ విభాగంలో చేరాలనేది లక్ష్యం. ఇంటర్‌ నారాయణ కళాశాల హైదరాబాదులో చదివానని, తన విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం మరువలేనిదని జాహ్నవిరెడ్డి తెలిపారు.

కల్లు జాహ్నవిరెడ్డి

142వ ర్యాంకు సాధించిన వెన్నెల

రామన్నపేట: వెల్లంకి గ్రామానికి చెందిన కూరెళ్ల వెన్నెల టీఎస్‌ ఈఏపీసెట్‌ ఫలితాల్లో ప్రతిభను చాటింది. శనివారం ప్రకటించిన ఫలితాల్లో వెన్నెల అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగంలో 142వ ర్యాంకు సాధించింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కూరెళ్ల భిక్షమాచారి, కవిత దంపతుల కుమార్తె వెన్నెల. బాల్యం నుంచి చదువులో ప్రతిభను చాటుతోంది. చౌటుప్పల్‌లోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో ఎస్సెస్సీ వరకు, హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసింది. టీఎస్‌ ఈఏపీసెట్‌ ఫలితాల్లో ప్రతిభను చాటిన వెన్నెలను పలువురు అభినందించారు.

కూరెళ్ల వెన్నెల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని