logo

ఆస్తులు బుగ్గవుతుంటే.. నివారించలేని జగన్‌ ప్రభుత్వం

వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్రమత్తంగా లేని సమయంలో ప్రమాదాలు సంభవించి ఆస్తులు బూడిద అవుతున్నాయి

Published : 23 Apr 2024 04:47 IST

అగ్నిమాపకశాఖ కార్యాలయం

కందుకూరు పట్టణం, గుడ్లూరు, న్యూస్‌టుడే: వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్రమత్తంగా లేని సమయంలో ప్రమాదాలు సంభవించి ఆస్తులు బూడిద అవుతున్నాయి. కొంతమంది వ్యాపారులు, అపార్టుమెంట్‌ నిర్వాహకులు, పాఠశాలలు, ఆసుపత్రులు తదితర ప్రాంతాల్లో అగ్నిమాపక పరికరాలు లేకుండా భవనాల నిర్మాణాలు చేపట్టారు. దీంతో కందుకూరు నియోజకవర్గంలో అక్కడక్కడా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని జగన్‌ ప్రభుత్వం ఆపలేకపోతోంది.

గతేడాది 94 ప్రమాదాలు

2023-24లో కందుకూరు కార్యాలయం పరిధిలో 94 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తద్వారా రూ.93.2లక్షలు ఆస్తి నష్టం సంభవించగా.. సుమారు రూ.2.63కోట్లు విలువైన ఆస్తిని అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది రక్షించారు. ఎక్కువగా జామాయిల్‌, మామిడి తోటలు, వరిగడ్డి వాములు ప్రమాదాలకు గురవుతున్నాయి.

 సమస్యలు తీరేదెన్నడో?

 అగ్నిమాపక కార్యాలయాన్ని కొన్ని సమస్యలు దీర్ఘకాలంగా వేధిస్తున్నాయి. మొత్తం 15 మందికిగానూ 10 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. 6 మండలాలకు ఒకే ఒక్క అగ్నిమాపక వాహనం ఉంది. లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు వంటి దూర ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నపుడు కందుకూరు నుంచి అక్కడికి వెళ్లేసరికి కొంత సమయం పడుతోంది. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోతోందని ప్రజలు భావిస్తున్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, దుకాణ సముదాయాలు, పెట్రోల్‌ బంకుల్లో అగ్నిమాపక శాఖ సూచనలు సక్రమంగా పాటిస్తున్న దాఖలాల్లేవు. జి+2 కంటే ఎక్కువ అంతస్తులు నిర్మించేవారు రెండు మెట్ల మార్గాలు ఏర్పాటు చేయడం లేదు.


ఆధునిక పరికరాలతో ప్రమాదాలు అరికట్టొచ్చు
బి.వెంకటేశ్వర్లు, అగ్నిమాపక శాఖాధికారి

ఆధునిక పరికరాలతో అందుబాటులో ఉంటే అగ్ని ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంటుంది. కందుకూరు ప్రాంతంలో ఎక్కువగా జామాయిల్‌, వరిగడ్డి వాములు కాలుతున్నాయి. వెంటనే తమకు సమాచారమిస్తే మంటలార్పేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు