logo

ప్రత్యర్థులపై కేసులు: కృష్ణారెడ్డి

ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం తన ప్రత్యర్థులిద్దరిపై పలు కేసులున్నాయని తెదేపా కావలి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి వెల్లడించారు.

Published : 28 Apr 2024 02:35 IST

కొండాపురం: మహిళలను ఓటు అడుగుతున్న సురేష్‌

కావలి, న్యూస్‌టుడే: ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం తన ప్రత్యర్థులిద్దరిపై పలు కేసులున్నాయని తెదేపా కావలి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి వెల్లడించారు. శనివారం విలేకరులకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అఫిడవిట్‌ ప్రతులను అందజేశారు. నకిలీ మద్యంతోపాటు మోసం, కుట్ర తదితర ఏడు కేసులు ఎమ్మెల్యేపై ఉన్నాయన్నారు. స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్‌పై ఎనిమిది కేసులున్నాయన్నారు.భాజపా నాయకులు కందుకూరి సత్యనారాయణ, తెదేపా రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, మండల కమిటీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, పట్టణ కమిటీ అధ్యక్షులు కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. తెదేపా దివ్యాంగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. వెంకట్రావు కావలి మండలంలోని కొత్తసత్రంలో ప్రచారం నిర్వహించారు.

ఉదయగిరి అభివృద్ధికి ప్రాధాన్యం: కాకర్ల సురేష్‌

కొండాపురం : తనను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌ తెలిపారు. మండలలోని గరిమెనపెంట, ఇస్కదామెర్ల, తూర్పుఎర్రబల్లి, చింతలదేవి పంచాయతీల్లో శనివారం ప్రచారం చేశారు. కంభం విజయరామిరెడ్డి, యారవ కృష్ణయ్య, మామిళ్లపల్లి ఓంకార్‌, కామేపల్లి సుబ్బారావు పాల్గొన్నారు. చంద్రబాబునాయుడును తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి.చెంచలబాబుయాదవ్‌ శనివారం కలిశారు. ఆత్మకూరు వచ్చిన చంద్రబాబునాయుడుని హెలిప్యాడ్‌ వద్ద కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. దుత్తలూరు:   దుత్తలూరులో  బొందల రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో  తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంభం విజయరామిరెడ్డి, అభ్యర్థి కాకర్ల సురేష్‌ సమక్షంలో వైకాపాకు చెందిన 50 కుటుంబాలు పార్టీలో చేరాయి.      

తెదేపాలో చేరికలు

పార్టీలో చేరిన హ్యాపీబాషా తదితరులతో ఇంటూరి

కందుకూరుపట్టణం: పట్టణానికి చెందిన  వైకాపా నాయకుడు షేక్‌ హ్యాపీబాషాతోపాటు మరికొందరు ముస్లింలు, బృందావనం కాలనీకి చెందిన పలువురు వైకాపా నేతలు పార్టీలో చేరారు. వైకాపా జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి సుదర్శి శ్యామ్‌, జంగాల వెంకట్రావు, పాలేటి కరుణాకర్‌, సత్యనారాయణ, కట్టా వెంకటనారాయణ, సురేష్‌, అజయ్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో ఎం. మురళీ, పెట్లూరి సుబ్బారావు, ఆర్‌.వెంకటేశ్వర్లు, ఎన్‌.రాధాకృష్ణ, పి.వెంకట్రావు పాల్గొన్నారు.

గుడ్లూరు : మండలంలోని దప్పళంపాడు, మొగళ్లూరు, చినలాటరపిలో తెదేపా నియోజకవర్గ అభ్యర్థి నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు.    కందుకూరు తెలుగు ప్రొఫెషనల్‌ వింగ్‌ ఆధ్వర్యంలో గోడపత్రాలను ఆవిష్కరించారు. వింగ్‌ నియోజకవర్గ బాధ్యురాలు పువ్వాడి మౌనిక, సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల బాధ్యులు నాగరాజు, మాలకొండయ్య, వెంకటేశ్వర్లు, సూర్యం, హరిబాబు, బుల్లెయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని