logo

TSRTC: కండక్టర్‌ను మరిచి.. బస్సు ముందుకు నడిపి

కండెక్టర్‌ను ఎక్కించుకోవడం మరిచిపోయి డ్రైవర్‌ బస్సుని పది కిలోమీటర్ల మేర తీసుకెళ్లిన ఘటన బాన్సువాడ డిపో పరిధిలో చోటుచేసుకుంది. ప్రయాణికుల కథనం ప్రకారం..

Updated : 18 Dec 2023 09:51 IST

పది కిలోమీటర్లు వెళ్లిన డ్రైవర్‌

బాన్సువాడ పట్టణం, న్యూస్‌టుడే: కండెక్టర్‌ను ఎక్కించుకోవడం మరిచిపోయి డ్రైవర్‌ బస్సుని పది కిలోమీటర్ల మేర తీసుకెళ్లిన ఘటన బాన్సువాడ డిపో పరిధిలో చోటుచేసుకుంది. ప్రయాణికుల కథనం ప్రకారం.. బాన్సువాడ నుంచి నిజామాబాద్‌ వెళ్లే ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ఓ వైపు మహాలక్ష్మి ఉచిత ప్రయాణం, మరోవైపు ఆదివారం సెలవు దినం, శుభకార్యాలు అధికంగా ఉండడంతో రద్దీగా ఉంది. దీంతో డ్రైవర్‌ కండెక్టర్‌ను గమనించక పది కిలోమేటర్ల మేర బస్సును తీసుకెళ్లారు. నస్రుల్లాబాద్‌ మండలం నెమ్లి గ్రామ శివారులో ప్రయాణికులు కండక్టర్‌ బస్సులో లేరని తెలపడంతో అక్కడ ఆపివేశారు. అనంతరం ప్రయాణికులను వేరే బస్సులోకి పంపించారు. ఈ ఘటనపై డిపో మేనేజర్‌ సరితాదేవిని వివరణ కోరగా.. కండక్టర్‌ బస్సులో ప్రయాణికులను ఎక్కించి బస్టాండ్‌లోని కంట్రోలర్‌ దగ్గరకి వెళ్లొస్తా అని చెప్పగా.. రద్దీ అధికంగా ఉండడంతో బస్సు తీయమని చెప్పాడనుకొని బయలుదేరినట్లు తెలిపారు. సోమవారం డ్రైవర్‌, కండక్టర్‌ ఇద్దరిని విచారించి తదుపరి చర్యలు తీసుకుంటానని డీఎం పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని