logo

Train: ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు: తప్పిన ఘోర ప్రమాదం

సుందర్‌గఢ్‌ జిల్లాలోని రవుర్కెలా రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో సహా రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చినా అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Published : 23 Nov 2023 08:57 IST

కటక్, న్యూస్‌టుడే: సుందర్‌గఢ్‌ జిల్లాలోని రవుర్కెలా రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో సహా రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చినా అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సంబల్‌పూర్‌-రవుర్కెలా మెము రైలు, రవుర్కెలా-ఝార్సుగూడ పాసింజర్‌ రైలు 100 మీటర్ల దూరంలో ఒకే లైన్లో ఎదురెదురుగా వచ్చాయి. మూడో రైలు పూరీ-రవుర్కెలా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇదే ట్రాక్‌పై ప్రయాణిస్తోంది. మెము-పాసింజరు రైళ్లు వంద మీటర్ల దూరంలో నిలిచిపోవడంతో ప్రమాదం జరగలేదు. రవుర్కెలా రైల్వే స్టేషనుకు కేవలం 200 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపం వల్లే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. రైల్వే అధికారులు ఈ ఘటనపై స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని