logo

లిఖిత హామీ ఇస్తేనే ఓట్లేస్తాం

ఉత్తరాముఖి ప్రాంతంలో సుమారు 172 కుటుంబాలున్నాయి. అక్కడ అంగన్‌వాడీ, ప్రజారోగ్య కేంద్రం, కల్యాణ మండపం లేవు. ప్రస్తుతం బిజద అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్‌చంద్రచ్యవు పట్నాయక్‌ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో స్థానికుల డిమాండ్లు

Published : 28 Apr 2024 06:55 IST

ఉత్తరాముఖి ప్రాంతవాసుల అసంతృప్తి
బ్రహ్మపుర బజారు, న్యూస్‌టుడే

నగరశివారున ఉత్తరాముఖి ప్రాంతం

ఎన్నాళ్ల నుంచో ఇక్కడ ఉంటున్నాం. ఇప్పటికీ పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటి పరిష్కారానికి ఎవరు లిఖితపూర్వక హామీ ఇస్తారో వారికే ఈసారి ఓట్టేస్తాం

బ్రహ్మపుర మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఈఎంసీ) ఒకటో వార్డులోని ఉత్తరాముఖి ప్రాంత ప్రజలు


త్తరాముఖి ప్రాంతంలో సుమారు 172 కుటుంబాలున్నాయి. అక్కడ అంగన్‌వాడీ, ప్రజారోగ్య కేంద్రం, కల్యాణ మండపం లేవు. ప్రస్తుతం బిజద అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్‌చంద్రచ్యవు పట్నాయక్‌ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో స్థానికుల డిమాండ్లు పరిష్కరిస్తానని అప్పట్లో హామీ ఇచ్చి తర్వాత విస్మరించారు. ఇప్పుడు మళ్లీ ఆయన పోటీ చేస్తున్నారు. ఈసారి చ్యవు పట్నాయక్‌కు ఓటేసేదే లేదని ఆ ప్రాంతవాసులు గట్టిగా చెబుతున్నారు. 172 కుటుంబాలలో 100 మందికి భూమి హక్కు పత్రాలు బీఈఎంసీ ఇచ్చిందని, మిగిలిన వారికి ఇవ్వలేదని చెప్పారు. స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసుకుంటామని, ఇందుకు సహకరించమని విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని, ఈసారి లిఖిత పూర్వకంగా మా డిమాండ్లు పరిష్కరిస్తామని ఇవ్వాలని, అప్పుడే ఓటేస్తామని వారంటున్నారు.


కల్యాణ మండపం నిర్మించాలి: మలాసి రెడ్డి

ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు గెలిచిన తరువాత ఇటువైపే రావడంలేదు. కార్పొరేటరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మామూలైపోయింది. ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి కల్యాణ మండపం లేదు. సామాజిక భవనం లేదు. ఈసారి అభివృద్ధి పనులు చేస్తామని, డిమాండ్లు నెరవేరుస్తామని రాసిచ్చిన వారికే ఓటు వేస్తాం.


స్వయం సహాయ బృందాలకు సహకరించాలి: కురెయి రెడ్డి

బీఈఎంసీ ఇతర వార్డులలో ఉన్న సౌకర్యాలు ఇక్కడ లేవు. స్వయం సహాయ బృందాలు (ఎస్‌హెచ్‌జీ) ఏర్పాటు చేసుకుంటామని పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదు. ఇతర వార్డులలో ఎస్‌హెచ్‌జీలున్నాయి. ఉత్తరాముఖిలో మాత్రం ఇప్పటికీ ఎస్‌హెచ్‌జీల్లేవు. ఇందుకు అనుమతి ఇవ్వాలని, రుణాలు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు విన్నవించినా సమాధానంలేదు. ఈసారి మా సమస్యలు తీర్చిన వారికే ఓటేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని