logo

ప్రభుత్వం లచ్చన్నను విస్మరించడం బాధాకరం: ఎంపీ

రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్నను విస్మరించడం బాధాకరమని ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. లచ్చన్న జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని డేఅండ్‌ నైట్‌ కూడలిలోని లచ్చన్న విగ్రహానికి తెదేపా శ్రీకాకుళం

Published : 17 Aug 2022 06:35 IST

    లచ్చన్న విగ్రహానికి నివాళి అర్పిస్తున్న  పీ రామ్మోహన్‌, మాజీ స్పీకరు ప్రతిభా భారతి, కూన రవికుమార్‌, గుండ లక్ష్మీదేవి

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్నను విస్మరించడం బాధాకరమని ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. లచ్చన్న జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని డేఅండ్‌ నైట్‌ కూడలిలోని లచ్చన్న విగ్రహానికి తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో కలిసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి లచ్చన్న ఎంతో కృషి చేశారని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపిన మహానీయుడు అని కొనియాడారు. అలాంటి వ్యక్తి జయంతిని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్లక్ష్యం చేయడం తగదని, ఇది బడుగు వర్గాల ప్రజలను అవమానించడమే అన్నారు. పలాసలో ఓ నాయకుడు సర్దార్‌ విగ్రహం తొలగించేందుకు యత్నించడం బాధాకరమన్నారు. అనంతరం కూన రవికుమార్‌, గుండ లక్ష్మీదేవి మాట్లాడారు. లచ్చన్న జిల్లా నుంచి ఎంతోమంది నాయకులను తయారు చేశారన్నారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభాభారతి, పార్టీ జిల్లా నాయకులు చౌదరి బాబ్జీ, మాదారపు వెంకటేష్‌, కొర్ను ప్రతాప్‌, మెండ దాసునాయుడు, ఎస్‌.వి.రమణమాదిగ, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, ఇప్పిలి తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని