logo

రోజురోజుకీ.. మరింత ముందుకు..

గార మండలంలోని కళింగపట్నం-మత్స్యలేశం ప్రాంతంలో వంశధార నది ప్రవాహానికి సాగరతీరం కోతకు గురవుతూనే ఉంది.

Updated : 28 Nov 2022 06:08 IST

అయిదేళ్ల కిందట కళింగపట్నం-మత్స్యలేశం సాగరతీరంలో శ్మశానవాటిక ఇలా..

గార మండలంలోని కళింగపట్నం-మత్స్యలేశం ప్రాంతంలో వంశధార నది ప్రవాహానికి సాగరతీరం కోతకు గురవుతూనే ఉంది. రోజురోజుకీ  సముద్రం మరింత ముందుకు వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వాడపాలెం గ్రామస్థుల అవసరాలకుగాను సముద్రతీరానికి సమీపంలో వంశధార నదీ తీరాన రూ.లక్షలు వెచ్చించి శ్మశానవాటిక నిర్మించారు. కోత కారణంగా దాన్ని చుట్టూ మట్టి కొట్టుకుపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ ప్రాంతంలో కోతను నివారణకు చేపట్టిన వరద రక్షణ పనులు మాత్రం కొలిక్కిరావడం లేదు. డ్రెడ్జింగ్‌ పనులు చేపట్టాల్సిన ఉన్నా పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా వాటిని వేగవంతం చేసి సమస్యల పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై జలవనరులశాఖ ఏఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రెడ్జింగ్‌ పనులకు టెండర్లు పిలించామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

న్యూస్‌టుడే, గార

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని