logo

పట్టాలు తప్పిన ఇంజినీరింగ్‌ స్పెషల్‌ రైలు

గంజాం జిల్లాలోని ఛత్రపురం-జగన్నాథపూర్‌ రైల్వే స్టేషన్‌ల మధ్యలో శనివారం ఖుర్దావైపు (డౌన్‌ లైను) వెళుతున్న ఓ ఇంజినీరింగ్‌ స్పెషల్‌ రైలు (పట్టాలు, ఇతర సామగ్రి ఉండే రైలు) మూడు చక్రాలు పట్టాలు తప్పాయి.

Published : 19 May 2024 02:13 IST

బ్రహ్మపుర స్టేషన్‌లో నిలిచిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లాలోని ఛత్రపురం-జగన్నాథపూర్‌ రైల్వే స్టేషన్‌ల మధ్యలో శనివారం ఖుర్దావైపు (డౌన్‌ లైను) వెళుతున్న ఓ ఇంజినీరింగ్‌ స్పెషల్‌ రైలు (పట్టాలు, ఇతర సామగ్రి ఉండే రైలు) మూడు చక్రాలు పట్టాలు తప్పాయి. ఈ రైలు చెన్నై-హావ్‌డా ప్రధాన మార్గంలోని లూప్‌ లైన్‌లో పట్టాలు తప్పాయని తూర్పు కోస్తా రైల్వే ప్రతినిధులు రాత్రి ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. ప్రధాన లైను క్లియర్‌ అయిందని, దీంతో రైళ్ల రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పట్టాలు తప్పిన రైలును పట్టాలపైకి చేర్చేందుకు పలాస నుంచి ఏఆర్టీ (రిలీఫ్‌) రైలు బయలుదేరిందని తెలిపారు. దీంతో విశాఖ-భువనేశ్వర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బ్రహ్మపుర రైల్వే స్టేషన్‌ మూడో నెంబరు ప్లాట్‌ఫాంపై గంటకుపైగా నిలిచిపోయిందని స్టేషన్‌ అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని