logo

పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు

స్వతంత్ర అభ్యర్థుల మధ్య చిక్కుకున్న మాజీ సీఎం ఓ.పన్నీర్‌సెల్వాన్ని గుర్తించలేక ఓటర్లు తికమకపడ్డారు. రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా మాజీ సీఎం బరిలో ఉన్నారు.

Updated : 20 Apr 2024 07:42 IST

అభ్యర్థుల పేరు, చిహ్నాలతో గోడపత్రం

ప్యారిస్‌, న్యూస్‌టుడే: స్వతంత్ర అభ్యర్థుల మధ్య చిక్కుకున్న మాజీ సీఎం ఓ.పన్నీర్‌సెల్వాన్ని గుర్తించలేక ఓటర్లు తికమకపడ్డారు. రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా మాజీ సీఎం బరిలో ఉన్నారు. ఆయనకు పనసపండు గుర్తుని కేటాయించారు. ఆయనకు ఓటు వేయాలనుకుని పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లిన చాలామంది పేరు, గుర్తు ఎక్కడుందో తెలియక గందరగోళానికి గురయ్యారు. మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం గుర్తు ఈవీఎంలలో 22వదిగా ఉంది. మొత్తం ఐదుగురు పన్నీర్‌సెల్వంలు పోటీచేస్తున్న స్థితిలో ఆయనకు ముందు ముగ్గురు, వెనక ఒక పన్నీర్‌సెల్వం ఉన్నారు. వారిలో ఎవరు మాజీ ముఖ్యమంత్రి అని గుర్తించలేక ఓటర్లు ఇబ్బంది పడ్డారు. మరోవైపు గుర్తుకు సంబంధించి కూడా గందరగోళానికి గురయ్యారు. మరో ఓ పన్నీర్‌సెల్వానికి కేటాయించిన ద్రాక్ష గుర్తు కూడా పనసపండులాగానే ఉండటంతో ఏ బటన్‌ నొక్కాలోనని తికమకపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని