logo

డీఎంకే డబ్బుతో గెలవాలనుకుంటోంది: అన్నామలై

డబ్బు ఎరచూపి కోవైని సొంతం చేసుకోవాలనుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కోవై లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి అన్నామలై ఆరోపించారు. ఆయన శుక్రవారం కరూర్‌ జిల్లా అరవక్కురిచ్చిలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Published : 20 Apr 2024 00:39 IST

విలేకర్లతో మాట్లాడుతున్న అన్నామలై

విల్లివాక్కం, న్యూస్‌టుడే: డబ్బు ఎరచూపి కోవైని సొంతం చేసుకోవాలనుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కోవై లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి అన్నామలై ఆరోపించారు. ఆయన శుక్రవారం కరూర్‌ జిల్లా అరవక్కురిచ్చిలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ఆన్‌లైన్‌ ద్వారా నగదు బట్వాడా జరిగినట్టు డీఎంకే అందజేసిన ఫిర్యాదు గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను నిజాయతీగా ఉన్నానని, డీఎంకే డబ్బుతో ఓటర్లకు కొనుగోలు చేసిందని ఆరోపించారు. కోవైలో భాజపా తరఫున ఎవరికైనా నగదు అందినట్లు నిరూపిస్తే తాను తక్షణం రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. కోవై ప్రజలు మాత్రమే కాకుండా కరూర్‌ ప్రజలు కూడా డీఎంకేకు తగిన గుణపాఠం నేర్పుతారని తెలిపారు.

కోయంబత్తూర్‌: కోయంబత్తూర్‌లో ఎన్నికల నిర్వహణలో అనేక లోపాలు కనిపిస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కోయంబత్తూర్‌ అభ్యర్థి అన్నామలై ఆరోపించారు. శుక్రవారం రామ్‌నగర్‌ పోలింగ్‌బూత్‌ వద్ద ఓటింగ్‌ పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలోని గౌండంబాళ్యంలోని అంగప్పపాఠశాల పోలింగ్‌ బూత్‌ వద్ద 830 మంది ఓటర్ల పేర్లను తొలగించినట్లు తెలిసిందన్నారు. అందుకు కారణాలు తెలియరాలేదన్నారు. ఎన్నికల అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం అందలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని