logo

ప్రధానోపాధ్యాయుడికి 47 ఏళ్ల జైలు

లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రధానోపాధ్యాయుడికి 47 ఏళ్ల జైలు శిక్ష పడింది. శివగంగై జిల్లా కాలైయార్‌కోవిల్‌ పంచాయతీ యూనియన్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా 2014లో మురుగన్‌ (54) పనిచేశారు.

Published : 23 Apr 2024 01:00 IST

సైదాపేట, న్యూస్‌టుడే: లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రధానోపాధ్యాయుడికి 47 ఏళ్ల జైలు శిక్ష పడింది. శివగంగై జిల్లా కాలైయార్‌కోవిల్‌ పంచాయతీ యూనియన్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా 2014లో మురుగన్‌ (54) పనిచేశారు. ఇతను పాఠశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో 6 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు తెలిసింది. దీంతో మురుగన్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ జిల్లా పోక్సో న్యాయస్థానంలో 10 ఏళ్లుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం కోర్టు తీర్పు వెలువడింది. నేరం రుజువు కావడంతో మురుగన్‌కు రెండు జీవిత ఖైదులతో పాటు 47 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అదేవిధంగా రూ.69 వేల జరిమానా విధించారు. బాధితులకు ప్రభుత్వం తరఫున రూ.29 లక్షలు నష్టపరిహారం అందించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని