logo
Published : 28/11/2021 04:27 IST

నగరానికి దూరంగా.. ఆప్తులకు దగ్గరగా.. పెళ్లి సందడి

 వివాహ వేడుకల్లో సరికొత్త పోకడ

అందుకు తగ్గట్టు రూపుదిద్దుకుంటున్న వేదికలు

ఈనాడు, విశాఖపట్నం

పెళ్లి వేదికలో.. ఆకట్టుకునే మండువా లోగిలి

వివాహ వేడుకలు సరికొత్త రీతుల్లో సాగుతున్నాయి. పాత ఆచార సంప్రదాయాలను గుర్తు చేసేలా.. నేటి రోజుల్లో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను అధిగమించేలా పెళ్లి సంగతులు సాగుతున్నాయి. దానికి ‘డెస్టినేషన్‌ వివాహాలు’ అనే పేరు జోడించి అనుసరిస్తున్నారు. వధూవరులు ఆసక్తి చూపుతుండటంతో వారి కుటుంబీకులు కూడా పిల్లల అభిరుచికి పెద్దపీట వేస్తూ సరే అంటున్నారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఇప్పటికే రాజస్థాన్‌, గోవా వెళ్లి పెళ్లి వేడుక నిర్వహించుకున్న కుటుంబాలెన్నో ఉన్నాయి. ఆ సంస్కృతికి విశాఖ ప్రాంతం కూడా ఇటీల కాలంలో వేదికవుతోది. అవసరమైన వారు కొద్ది రోజులు ముందే వచ్చి ప్రశాంత వాతావరణం కలిగిన ప్రాంగణాలను అన్వేషిస్తున్నారు.

* ముఖ్యంగా విశాఖ పరిసర ప్రాంతానికి చెంది...విదేశాల్లో స్థిరపడిన కుటుంబాలు ఇక్కడికే ఆసక్తి చూపుతున్నాయి. ఐటీ, బ్యాంకింగ్‌, పలు సేవారంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత ఈ తరహాలో ప్రణాళిక చేసుకుంటున్నారు.  హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, ఇతర నగరాలకు చెందిన వారు విశాఖ నగర పరిసరాలపై ఆసక్తి చూపుతున్నారు.

* అందుకే ఆసక్తి: స్థానికులు చాలా మంది ఉద్యోగాల నిమిత్తం వెళ్లి విదేశాలు, దేశంలో, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. అటువంటి వారికి ఇక్కడ ఇళ్లున్నా వాటిని అద్దెకు ఇచ్చేసుంటారు. వివాహం కోసం మళ్లీ వాటిని ఖాళీ చేయించడం... మళ్లీ అద్దెకు ఇవ్వడం కొంత భారమైన వ్యవహారం. అందుకే ముందుగానే నగర పరిసరాల్లో ఒక ‘డెస్టినేషన్‌ కల్యాణ వేదిక’ను ఎంపిక చేసుకొంటున్నారు. కొద్ది  రోజుల పాటు అక్కడే ఉండి పెళ్లిసందడిలో గడిపి వెళుతున్నారు. 

*  రోజుల పాటు..

పూర్వం పెళ్లంటే బంధువులను పిలిచి కొన్ని రోజుల పాటు సరదాగా కార్యక్రమాలు నిర్వహించేవారు. పెళ్లి పనులు ముగిసేవరకూ బంధుమిత్రులతో సంబరంగా ఉండేది. ఆ తరువాత పరిస్థితుల మారిపోయాయి. ఆ ఒక్కరోజు వస్తున్న బంధువులు ఆశీర్వదించి వెళ్లిపోతున్నారు. మళ్లీ ఇప్పుడు కుటుంబాల ఆర్థిక స్థితులనుబట్టి పాత రోజులను గుర్తు చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా దగ్గరి సన్నిహితులు, కొందరు బంధువుల మధ్య గడుపుతూ కొద్ది రోజుల పాటు పెళ్లి కోలాహలం నెలకొనేలా ‘డెస్టినేషన్‌’ విధానంపై దృష్టిసారించారు.

జిల్లాలో ఎక్కడంటే..: అరకు, అనంతగిరి, రుషికొండ , భీమిలి, కాపులుప్పాడ, భోగాపురంలో నూతన విధానానికి తగ్గట్లు కల్యాణ వేదికలు తీర్చిదిద్దుతున్నారు.

* వీటి కోసం ప్రత్యేకంగా..

ఈ విధానంలో సాగే వివాహాలకు కొందరు ప్రత్యేక వేదికలను సిద్ధం చేస్తున్నారు.  విశాల ప్రాంగణం, ఉద్యానవనాలు, కొలను ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రత్యేక నిర్మాణాలు, ఏర్పాట్లు ఎంతగానో ఆకట్టుకుంటాయి. సొంత ఇంట్లో పెళ్లి జరిగిన అనుభూతి కలిగించేలా వసతులు కల్పిస్తున్నారు. సువిశాల వేదిక, వ్యాయామశాల, క్రీడా ప్రాంగణాలతో కొద్ది రోజుల పాటు ఆనందంగా గడిపేందుకు వీలుగా ఉంటున్నాయి.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని