logo

మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు

కార్మిక శాఖ ఎ.పి. దుకాణాలు, సంస్థల చట్టం-1988 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరిగే మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్‌ ఆదూరు గణేశన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 23 Apr 2024 04:28 IST

కార్మికశాఖ సంయుక్త కమిషనర్‌ ఆదూరు గణేశన్‌

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: కార్మిక శాఖ ఎ.పి. దుకాణాలు, సంస్థల చట్టం-1988 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరిగే మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్‌ ఆదూరు గణేశన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఏదైనా వ్యాపారం, వాణిజ్యం, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు వీలుగా పోలింగ్‌ రోజు సెలవు మంజూరు చేయాలని అదేశించారు. ఏదైనా యజమాని ఈ నిబంధన ఉల్లంఘిస్తే వారు జరిమానాతో పాటు శిక్షార్హులని తెలిపారు. దుకాణాలు, సంస్థల యజమానులు మే 13న కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని కార్మికశాఖ కమిషనర్‌ ఎం.వి.శేషగిరిబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని గణేశన్‌ గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని