logo

దాడి పూర్వాపరాలపై డీసీపీ ఆరా

తెదేపాకు ఓటు వేయలేదన్న కక్షతో కంచరపాలెం బర్మాక్యాంప్‌లో నూకాంబిక ఆలయం వద్ద గురువారం ఒక కుటుంబంపై జరిగిన దాడి కేసుకు సంబంధించి రాజకీయ ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం డీసీపీ-2 ఎం.సత్తిబాబు ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

Published : 18 May 2024 02:51 IST

దాడి జరిగిన ప్రాంతంలో స్థానికులతో మాట్లాడుతున్న డీసీపీ-2 ఎం.సత్తిబాబు 

మాధవధార, న్యూస్‌టుడే: తెదేపాకు ఓటు వేయలేదన్న కక్షతో కంచరపాలెం బర్మాక్యాంప్‌లో నూకాంబిక ఆలయం వద్ద గురువారం ఒక కుటుంబంపై జరిగిన దాడి కేసుకు సంబంధించి రాజకీయ ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం డీసీపీ-2 ఎం.సత్తిబాబు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల స్థానిక ప్రజల నుంచి దాడికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గొడవ ఎలా, ఎప్పుడు జరిగింది, గొడవకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల ప్రవర్తన, ఇతర అంశాలపై పూర్తిగా పరిశీలన చేశారు. అయితే ఇది కేవలం వ్యక్తిగత కక్షలతోనే జరిగిందని, దీంట్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో కూడా రాజకీయ ప్రమేయం ఉన్నట్లుగా తెలియజేయలేదని, ఇది కేవలం కావాలనే ఎవరో బాధితులను తప్పుదోవ పట్టించారని డీసీపీ తెలియజేశారు. వెస్ట్‌ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని