logo

కొత్త ఓటర్లు 24,599 మంది

ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి, ఓటు హక్కు లేనివారికి ఎన్నికల సంఘం చివరి అవకాశంగా ఏప్రిల్‌ 15 వరకూ గడువిచ్చింది.

Published : 29 Apr 2024 02:51 IST

ఓటుహక్కు నమోదులోనూ మహిళలే ముందు

ఏలూరు నగరం, న్యూస్‌టుడే: ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి, ఓటు హక్కు లేనివారికి ఎన్నికల సంఘం చివరి అవకాశంగా ఏప్రిల్‌ 15 వరకూ గడువిచ్చింది. ఈ అవకాశాన్ని యువత చక్కగా ఉపయోగించుకుంది. ఓటు లేనివారు, వివిధ కారణాలతో కోల్పోయినవారు ఓటుహక్కు పొందారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా 24,599 మంది నమోదు చేసుకున్నారు. వీరిని అనుబంధ జాబితాలో ప్రకటిస్తారు. జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ. కొత్తగా నమోదైనవారిలో వారే ముందుండటం విశేషం. కొత్త ఓటర్లు 24,599 మందిలో మహిళలు 14,578 మంది ఉన్నారు. పురుషులు 10,021 మంది. ఏలూరు జిల్లాలో 13,014 మంది కొత్త ఓటర్లుగా నమోదు కాగా, పశ్చిమ జిల్లాలో 11,585 మంది చేరారు. అనుబంధ జాబితాతో కలిపి ఏలూరు జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,37,430 కాగా, పశ్చిమలో 14,72,923కు చేరింది. ఏలూరు జిల్లాలో  నమోదైన వారిలో ఏలూరు నియోజకవర్గం నుంచి అధికంగా 4,621 మంది ఉన్నారు. రెండో స్థానంగా నూజివీడులో 1,842 మంది నమోదు చేయించుకున్నారు. పశ్చిమలో జిల్లా కేంద్రం భీమవరం నుంచి 2,051 మంది, ఆ తర్వాత ఆచంట నుంచి 2,027 మంది నమోదుచేయించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని