logo

జె-బ్రాండ్లతో ప్రజారోగ్యం గుల్ల

రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యం తాగి 30 వేల మంది కిడ్నీ, లివర్‌ వ్యాధుల బారిన పడ్డారు.. అనారోగ్యాలు బయటపడని వారు ఎంతమంది ఉన్నారో అంచనాలకు అందని పరిస్థితి ఉందని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి   కనుమూరి రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు.

Published : 29 Apr 2024 02:58 IST

వైకాపాకు 25 అసెంబ్లీ స్థానాలు కూడా రావు
రఘురామకృష్ణరాజు వెల్లడి

మాట్లాడుతున్న ఎంపీ, చిత్రంలో రామరాజు, నాగరాజు తదితరులు

ఉండి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యం తాగి 30 వేల మంది కిడ్నీ, లివర్‌ వ్యాధుల బారిన పడ్డారు.. అనారోగ్యాలు బయటపడని వారు ఎంతమంది ఉన్నారో అంచనాలకు అందని పరిస్థితి ఉందని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి   కనుమూరి రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. ఉండిలో ఆదివారం జరిగిన తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికలకు జగన్‌ రూ.10 వేల కోట్లు తీసినా ఆశ్చర్యపోవాల్సి అవసరం లేదన్నారు. ఉండిలో తన నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యేలా చేసేందుకు ముగ్గురు న్యాయవాదులను పంపి రకరకాల ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురం, ఉండి అసెంబ్లీ స్థానాలపై జగన్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టి కుట్రలకు రంగం సిద్ధం చేశారన్నారు. మనమంతా     కలిసికట్టుగా ముందుకెళ్లి శత్రువును మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. తాను చేయించిన వేర్వేరు సర్వేల ఆధారంగా జగన్‌కు 20-25 అసెంబ్లీ సీˆట్లు కూడా రావని తేలిందని పేర్కొన్నారు.

జగన్‌ కోవర్టులా శివరామరాజు

ఉండి నియోజకవర్గంలో తెదేపాకు 55- 56 శాతం ఓట్లు పడతాయని సర్వేలో తేలిందన్నారు.  ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు జగన్‌ కోవర్టులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైకాపా ఓట్లనే నరసింహరాజు, శివరామరాజు పంచుకొనే అవకాశం ఉందన్నారు. పార్టీ కోసం పదవిని త్యాగం చేసి నాయకుడు రామరాజు అని, పార్టీని అల్లరి చేస్తున్నది శివరామరాజు అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని