logo

అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణం

ఆరేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడం, చేసిన అప్పులు తీరక జీవితంపై విరక్తి చెందిన రైతు సిరిగిరెడ్డి సాంబశివారెడ్డి (54) ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం సిద్దవటం మండలంలోని డేగనవాండ్లపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల

Updated : 26 Jan 2022 06:13 IST


సాంబశివారెడ్డి (దాచిన చిత్రం)


సిద్దవటం, న్యూస్‌టుడే: ఆరేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడం, చేసిన అప్పులు తీరక జీవితంపై విరక్తి చెందిన రైతు సిరిగిరెడ్డి సాంబశివారెడ్డి (54) ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం సిద్దవటం మండలంలోని డేగనవాండ్లపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం సిద్దవటం మండలం టక్కోలు గ్రామ పంచాయతీలోని డేగనవాండ్లపల్లె గ్రామానికి చెందిన సాంబశివారెడ్డికి పంటల సాగులో నష్టం రావడంతో రూ.15 లక్షలకు అప్పు పెరిగినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో అప్పుల భారం తాళలేక స్థానికంగా ఉన్న పాత అంగన్వాడీ భవనంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శవ పంచనామ నిమిత్తం మృతదేహాన్ని కడపలోని సర్వజన ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయనకు భార్య పద్మావతి, కుమార్తె, కుమారుడు ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని