logo

నిరుద్యోగులకు సీఎం జగన్‌ మోసం

‘బద్వేలు ఎమ్మెల్యే రబ్బరు స్టాంపు అంటకదన్నా.. గెలిచాక ఎప్పుడైనా చూశారా.. అంతా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చూసుకుంటాడంట కదా.. కొండలు.. గుట్టలు వదలిపెట్టడం లేదంటకదా’ అని పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్‌ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి షర్మిల ఘాటుగా విమర్శలు సంధించారు.

Published : 02 May 2024 05:23 IST

బద్వేలు ఎమ్మెల్యే రబ్బరు స్టాంపు
పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల  

బద్వేలు సభలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

బద్వేలు, గోపవరం, కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, అట్లూరు, న్యూస్‌టుడే: ‘బద్వేలు ఎమ్మెల్యే రబ్బరు స్టాంపు అంటకదన్నా.. గెలిచాక ఎప్పుడైనా చూశారా.. అంతా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చూసుకుంటాడంట కదా.. కొండలు.. గుట్టలు వదలిపెట్టడం లేదంటకదా’ అని పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్‌ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి షర్మిల ఘాటుగా విమర్శలు సంధించారు. బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బద్వేలు మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె బద్వేలు నాలుగురోడ్ల కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు 2.30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన సీఎం జగన్‌ మాట తప్పారన్నారు. సంక్రాంతికి జాబ్‌ క్యాలెండర్‌ అన్నారని, అయిదు సంక్రాంతులు గడిచిపోయినా పట్టించుకోలేదన్నారు.అమ్మఒడి ఒకరికే పరిమితం చేశారని, మిగిలిన పిల్లలను జగన్‌కు దత్తత ఇస్తామా అని వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు.  బద్వేలు పురపాలక సంఘంలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదన్నారు. కడప పార్లమెంట్‌ స్థానానికి పోటీచేసే తనను, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీచేసే ఎన్‌డీ విజయజ్యోతిని ఆశీర్వదించాలని కోరారు. సీపీఎం నాయకులు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఈ నెల 13న లోక్‌సభ, శాసనసభలకు జరిగే ఎన్నికలు దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకతను సంతరించుకున్నాయన్నారు. ప్రచారంలో కాంగ్రెస్‌, సీపీఐ నాయకులు అచ్యుతరాజు, వీరశేఖర్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని