logo

నీరందించాలని నిరసన

‘ఎన్నికలొస్తేనే నాయకులు ఇళ్ల వద్దకు వస్తారు.. ఆ తర్వాత అయిదేళ్లయినా కనిపించరు.. మూడు నెలలుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం... ప్రజాప్రతినిధులు పెడచెవిన పెడు తున్నారు... అధికారులు పట్టించుకోరు..

Published : 29 Apr 2024 03:50 IST

న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ: ‘ఎన్నికలొస్తేనే నాయకులు ఇళ్ల వద్దకు వస్తారు.. ఆ తర్వాత అయిదేళ్లయినా కనిపించరు.. మూడు నెలలుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం... ప్రజాప్రతినిధులు పెడచెవిన పెడు తున్నారు... అధికారులు పట్టించుకోరు.. మాగోడు ఎవరికి తెలియజేయాలి’ అని మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని ఇందిరమ్మకాలనీ, వైయస్‌ఆర్‌ కాలనీ వాసులు ఆదివారం రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. సుమారు 15 ఏళ్ల కిందట వైయస్‌ఆర్‌ హయాంలో ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల పట్టాలిచ్చారు. నాలుగేళ్ల నుంచి నీటి సమస్య నెలకొంది. పైపులైను ద్వారా అస్తవ్యస్తంగా నీటి సరఫరా చేస్తున్నారు. అయిదేళ్ల పాటు అధికార పార్టీకి పాలకులు, ఎమ్మెల్యేకు అంతర్గత విభేదాలతో కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమయ్యారు. దీంతో వినియోగానికి ప్రైవేటు ట్యాంకులను ఆశ్రయించి రూ.600తో కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని కాలనీవాసులు వాపోతున్నారు. సమస్య పరిష్కారం కాకుంటే జాతీయరహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. నీటి సమస్యపై నిరసన వ్యక్తం చేస్తున్న అమ్మచెరువుమిట్ట ఇందిరమ్మ కాలనీ వాసులను చిత్రంలో చూడొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని