logo
Published : 02/12/2021 05:03 IST

చలిలో అభాగ్యులు... చలించని అధికారులు

ఈనాడు అమరావతి


ప్రకాశం బ్యారేజి వద్ద చలికి తాళలేక ప్లాస్టిక్‌ సంచి కప్పుకుని నిద్రిస్తున్న చిత్రం

రాత్రయితే చాలు నగరంలోని ముఖ్య కూడళ్లు.. ఫుట్‌పాత్‌లు, డివైడర్‌లు వేలాది మందికి పట్టుమంచాలుగా మారిపోతాయి. దోమలు కుడుతున్నా.. చలి వణికిస్తున్నా లెక్కచేయకుండా వారు అలసిపోయి నిద్రపోతుంటారు. వారంతా కూడా పొట్ట చేతబట్టుకొని నగరానికి వలస వచ్చిన వారే. పగలంతా ఎక్కడో ఓ చోట కష్టపడి పనిచేసి రాత్రయితే ఫుట్‌పాత్‌లు, డివైడర్లు, బ్యారేజి, రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో నిద్రిస్తున్నారు. కొందరు కనీసం దుప్పట్లు కూడా లేకుండా గోనెసంచులు, ఫ్లెక్సీలు కప్పుకొని విశ్రమిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అలా నిద్రిస్తున్న వారిపై బ్లేడ్‌బ్యాచ్‌లు దాడి, డబ్బులు, ఇతర వస్తువులను లాక్కెళ్లిన ఘటనలూ ఉన్నాయి. ఇలాంటి నిరాశ్రయుల కోసం నగరపాలక సంస్థ వసతి గృహాలు ఏర్పాటు చేసింది. కానీ ఆ విషయం ఈ అభాగ్యులకు తెలియదు. నగరంలోని హనుమాన్‌పేట, గాంధీనగర్‌, చిట్టినగర్‌, వారధి వద్ద నిరాశ్రయుల కోసం వసతి గృహాలు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో తెలిసేలా కనీస సమాచారం కూడా నగరంలో ఎక్కడా కనిపించదు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ముఖ్య కూడళ్లలో బోర్డులు ఏర్పాటు చేస్తే బడుగు జీవులకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సోమవారం రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు నగరంలోని ప్రధాన కూడళ్లలో ‘ఈనాడు’ ప్రత్యక్ష పరిశీలనలో కనిపించిన చిత్రాలివి.

హనుమాన్‌పేటలో నిరాశ్రయుల వసతిగృహం

లోపల మంచాలు

 

 

రైల్వేస్టేషన్‌ బయట

బీఆర్టీఎస్‌ రోడ్డు మధ్యలో

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని